News May 1, 2024

కడప పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు

image

కడప పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రెకెత్తిస్తున్నాయి. ఎంపీ అవినాశ్ రెడ్డిపై ప్రధానంగా షర్మిల, భూపేష్ రెడ్డి బరిలో నిలిచారు. విమర్శలతో ప్రచారాలు వాడి వేడిగా సాగుతున్నాయి. దీంతో కడప ఎంపీగా గెలిచేది ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. జగన్‌పై వ్యతిరేక ఓటును షర్మిల చీల్చే అవకాశం ఉందని జిల్లా నేతలు చర్చించు కుంటున్నారు. దీంతో కడపలో ఈ సారి త్రిముఖ పోరు తప్పదని విశ్లేషకులు అంటున్నారు.

Similar News

News December 7, 2025

కడప మేయర్ ఎన్నికకు ఆహ్వానం.!

image

కడప మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతి కార్పొరేటర్ ఈనెల 11 జరిగే ప్రత్యేక సమావేశానికి రావాలంటూ జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ లేఖలు పంపించారు. కడప నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో ఉదయం 11 గంటలకు నూతన మేయర్‌ను కార్పొరేటర్లు ఎన్నుకోనున్నారు.

News December 7, 2025

పులివెందులలో YS జార్జిరెడ్డికి విజయమ్మ నివాళి.!

image

మాజీ ముఖ్యమంత్రి YSR సోదరుడు వైయస్ జార్జిరెడ్డి వర్ధంతి ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ సమాధుల తోటలో వైయస్ జార్జిరెడ్డి సమాధితోపాటు రాజారెడ్డి, వివేకానందరెడ్డి సమాధుల వద్ద పూలమాలలు పెట్టి వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ నివాళులర్పించారు. అనంతరం పులివెందులలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.