News May 13, 2024

కడప: బార్ల వద్ద బారులు తీరిన ప్రజలు

image

ఎన్నికల పోలింగ్ సమయం ముగియడంతో కడపలో బార్ల వద్ద మద్యం కోసం మందుబాబులు బారులు తీరారు. పోలింగ్ కు 48 గంటల ముందు అన్ని వైన్ షాప్ లు, బార్లను ముందస్తు చర్యలలో భాగంగా మూసివేశారు. పోలింగ్ ముగియడంతో ఎప్పుడెప్పుడు తీరుస్తారా అని మద్యం కోసం ఎదురుచూస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు తెరుస్తారన్న సమాచారంతో పెద్ద ఎత్తున ప్రజలు కాపలా కాస్తున్నారు.

Similar News

News December 7, 2025

కడప మేయర్ ఎన్నికకు ఆహ్వానం.!

image

కడప మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతి కార్పొరేటర్ ఈనెల 11 జరిగే ప్రత్యేక సమావేశానికి రావాలంటూ జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ లేఖలు పంపించారు. కడప నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో ఉదయం 11 గంటలకు నూతన మేయర్‌ను కార్పొరేటర్లు ఎన్నుకోనున్నారు.

News December 7, 2025

పులివెందులలో YS జార్జిరెడ్డికి విజయమ్మ నివాళి.!

image

మాజీ ముఖ్యమంత్రి YSR సోదరుడు వైయస్ జార్జిరెడ్డి వర్ధంతి ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ సమాధుల తోటలో వైయస్ జార్జిరెడ్డి సమాధితోపాటు రాజారెడ్డి, వివేకానందరెడ్డి సమాధుల వద్ద పూలమాలలు పెట్టి వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ నివాళులర్పించారు. అనంతరం పులివెందులలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.