News August 20, 2025
కడప: రానున్న రోజుల్లో అన్ని మండలాల్లో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్లు

జిల్లాలోని అన్ని మండలాలలో సెంట్రలైజేడ్ స్మార్ట్ కిచెన్లు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సెంట్రలైజేడ్ స్మార్ట్ కిచెన్ల గురించి అధికారులతో సమీక్ష చేశారు. ఇప్పటికే కడపలో ఏర్పాటుచేసిన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచిందని, అదే స్ఫూర్తితో అన్ని మండల కేంద్రాలలో ఏర్పాటుకు అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు.
Similar News
News January 18, 2026
కడప: ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీనా.. ఫోన్ చేయండి.!

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు ఛార్జీలను విపరీతంగా పెంచాయి. దీంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దీనిపై రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. నిబంధనలకు లోబడి మాత్రమే ఛార్జీలను వసూలు చేయాలని ట్రావెల్స్ యజమానులకు సూచించారు. ఎవరైన అధిక ఛార్జీలు వసూలు చేస్తే 9281607001 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

కడప జిల్లాతో NTRకు అనుబంధం.. మీకు తెలుసా!

దివంగత నేత NTRకు కడపతో ప్రత్యేక అనుబంధం ఉంది. NTR 1983లో తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచారం కోసం చైతన్య రథంలో హరికృష్ణ డ్రైవర్‌గా రోడ్డు షో నిర్వహించారు. ఈ యాత్ర తాళ్ల ప్రొద్దుటూరు, పాతచౌటపల్లి, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కడప మీదుగా సాగింది. పాతచౌటపల్లి చిత్రావతి నదిలో చైతన్య రథం మొరాయించడంతో అక్కడే ఆయన బస చేశారు. తిరిగి 1984లో పులివెందుల, కొండాపురం తదితర ప్రాంతాలలో ఆయన పర్యటించారు. నేడు NTR వర్ధంతి.