News June 27, 2024
కడప: రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు జులై 1 వరకు గడువు

పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఈ నెల 27వ తేదీ నుంచి జులై 1వ తేదీలోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని డీఈఓ మర్రెడ్డి అనురాధ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫీజును హెచ్ఎంకు మాత్రమే సమర్పించాలన్నారు. ప్రతి సబ్జెక్టు జవాబు స్క్రిప్ట్ రీకౌంటింగ్ కోసం దరఖాస్తు రుసుం రూ.500 చెల్లించాలన్నారు. రీవెరిఫికేషన్ కోసం రూ. 1000 చెల్లించాలని తెలిపారు.
Similar News
News February 18, 2025
ముద్దనూరులో రోడ్డు ప్రమాదం

ముద్దనూరు మండలంలోని తిమ్మాపురం గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కడప నుంచి గండికోట వెళ్తుండగా ఇన్నోవా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 18, 2025
ప్రతి ఒక్కరూ ప్రజలకు న్యాయం చేయాలి: ఎస్పీ

న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ అధికారులు విచారించి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులకు ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తూ ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం చేయకుండా విచారించి సత్వరమే న్యాయం చేయాలన్నారు.
News February 17, 2025
ఒంటిమిట్టకు చేరిన శ్రీవారి లడ్డూలు

ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి దేవాలయానికి సోమవారం తిరుమల శ్రీవారి లడ్డూలు వచ్చాయి. తిరుమల నుంచి ప్రత్యేక వాహనంలో వచ్చిన 1500 లడ్డులను సిబ్బంది ఆలయంలోనికి తీసుకువెళ్లారు. గతంలో రెండవ శనివారం, నాలుగవ శనివారం ఇచ్చే లడ్డూలు, గత కొన్ని నెలలుగా ప్రతిరోజు ఇస్తున్న విషయం తెలిసిందే.