News October 28, 2024
కడప: రోకలి బండతో అత్తపై దాడి.. జైలు శిక్ష

కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాలతో అత్తను రోకలి బండతో కొట్టి గాయపరిచిన కేసులో ముద్దాయికి 1 సంవత్సరం జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధించారు. 2022 సంవత్సరంలో నెహ్రూ నగర్‌లో నివాసం ఉంటున్న బాధితురాలిపై రోకలి బండతో దాడి చేసి గాయపర్చిన నిందితుడు శ్రీనివాసులుపై అప్పట్లో కేసు నమోదైంది. విచారణ చేసిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో సోమవారం 2వ అదనపు జడ్జి శిక్ష ఖరారు చేశారు.
Similar News
News February 12, 2026
YVU దూరవిద్య సమాచారం కోసం ప్రత్యేక డొమైన్

YVU దూరవిద్య సంబంధిత సమగ్ర సమాచారం అందుబాటులోకి తెస్తూ వైవీయూ వెబ్సైట్లో ప్రత్యేక డొమైన్‌ను VC ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ప్రారంభించారు. అనుబంధ దూరవిద్యా కేంద్రాలకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. కోర్సులు, అడ్మిషన్లు, ఫీజులు, పరీక్షల షెడ్యూల్ ఇలా సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. రిజిస్ట్రార్ పి.పద్మ, ప్రొ.కె.కృష్ణారెడ్డి, ప్రొ.తుమ్మలకుంట శివ, డా.శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
News February 12, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..!

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము ధర: రూ.15,910
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము ధర: రూ.14,637
*వెండి 10 గ్రాముల ధర: రూ.2,675 గా ఉన్నాయి.
News February 12, 2026
కడప: ఆ 40 మందిలో మీ MLA ఉన్నారా..?

ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో కడప జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని సీఎం వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా.. అయితే కామెంట్ చేయండి.


