News September 3, 2024
కడప విమానాశ్రయ అభివృద్ధికి చర్యలు: కలెక్టర్
పర్యావరణానికి ఎలాంటి అంతరాయం లేకుండా నిబంధనలకు లోబడి కడప ఏరోడ్రమ్ అభివృద్ధి పనులను చేపట్టేందుకు, చర్యలు తీసుకుంటున్నట్లు కడప జిల్లా కలెక్టర్ ఏరోడ్రమ్ కమిటీ చైర్మన్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. కడప విమానాశ్రయం టర్మినల్ బిల్డింగ్‌లో ఏరోడ్రమ్, ఎయిర్ ఫీల్డ్ ఇన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీల సమావేశం జరిగింది. దీంతో విమానాశ్రయ అభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News September 16, 2024
చాపాడు: ఢివైడర్ ఢీకొని యువకుడు దుర్మరణం
మైదుకూరు – పొద్దుటూరు ప్రధాన రహదారిలో డివైడర్ ఢీకొని యువకుడు దుర్మరణం చెందాడు. చాపాడు మండలం విశ్వనాథపురం వద్ద రోడ్డు నిర్మాణంలో భాగంగా ఆర్ అండ్ బీ అధికారులు ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ల వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు తెలిపారు. పొద్దుటూరు నుంచి మైదుకూరుకి వస్తున్న రహదారిపై వేసిన స్పీడ్ బ్రేకర్ గుర్తించలేక స్కూటీ బోల్తా పడి మరణించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 16, 2024
కడప: గంగమ్మ ఒడికి చేరుకున్న గణనాథులు
చిన్నమండెం మండల వ్యాప్తంగా భక్తుల నుంచి విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా గ్రామాల్లో మధ్యాహ్నం నుంచి కోలాహలం మొదలైంది. వాడవాడలా కొలువుదీరిన వినాయక విగ్రహాలు డప్పులు, మేళతాళాలు, బాజా భజంత్రీలు, బాణసంచా పేలుళ్ల నడుమ బారులు తీరిన భక్తులు గణనాథునికి నీరాజనాలర్పించారు.
News September 16, 2024
పోరుమామిళ్ల మండలంలో వ్యక్తి సూసైడ్
పోరుమామిళ్ల మండలం ఈదులపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఈదుళ్ళపళ్లి గ్రామానికి చెందిన రమేశ్ అనే వ్యక్తి సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఉరివేసుకొని మృతి చెందాడు. మృతుడు స్థానికంగా ఉండే పెట్రోల్ బంకులో పంపు ఆపరేటర్‌గా పనిచేసే వ్యక్తిగా గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు పరిశీలించి, ఇది హత్యా ఆత్మహత్యా అన్న కోనంలో దర్యాప్తు చేస్తున్నారు.