News November 19, 2024
కడప: శబరిమల వెళ్లే స్వాములకు GOOD NEWS
అయ్యప్ప భక్తుల కోసం కడప మీదుగా మచిలీపట్నం- కొల్లామ్ (QLN) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు డిసెంబర్ 23,30న మచిలీపట్నం- కొల్లామ్ QLN (నం.07147), డిసెంబర్ 25, జనవరి 1న కొల్లాం QLN- మచిలీపట్నం (నం.07148) రైళ్లు నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో కడపతోపాటు ఎర్రగుంట్ల, రాజంపేట రైల్వే స్టేషన్లలో ఆగుతాయని పేర్కొన్నారు. రేపటి నుంచి రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు.
Similar News
News November 23, 2024
పోరుమామిళ్ల వాసికి 20 ఏళ్ల జైలు శిక్ష
నెల్లూరు కోర్టులో పోరుమామిళ్ల వాసి పప్పర్తి సుబ్బరాయుడుకి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. సుబ్బరాయుడు 2020 మేలో బాలిక (14), ఆమె చిన్నాన్నను లారీలో ఎక్కించుకున్నాడు. అతడిని ఓ హోటల్ దగ్గర దింపి, కృష్ణపట్నం హైవేపై లారీని ఆపి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక చిన్నాన్న ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.22వేల జరిమానా కోర్టు విధించింది.
News November 23, 2024
నిమ్మ పంటను పరిశీలించిన కడప జిల్లా కలెక్టర్
పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కలసపాడు తహశీల్దారు కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం మండలంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పనులపై అరా తీశారు. అనంతరం తెల్లపాడు గ్రామపంచాయతీ దూలంవారిపల్లిలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద లబ్ధి పొందిన రైతు పొలంలో పర్యటించారు. కొమ్ముల హరి అనే రైతు సాగు చేసిన నిమ్మ పంటను సూసి సంతోషించారు.
News November 22, 2024
కడప: అధికారులు ప్రాథమిక విధులు విస్మరించరాదు.!
రెవెన్యూ రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ భూముల కేటాయింపు విషయంలో ప్రాథమిక విధులను విస్మరించకుండా SOP ప్రకారం బాధ్యతలను నిర్వహించాలని, కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ విషయాలపై శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. భూముల రీ సర్వే, భూ రికార్డుల స్వచ్చీకరణ, ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్, భూసేకరణ రెవెన్యూ శాఖలో పెండింగ్ అంశాలు తదితర అంశాలపై చర్చించారు.