News April 22, 2024
కడప: శిల్పారామంలో నృత్య ప్రదర్శన

కడప నగర పరిధిలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఆటవిడుపు కార్యక్రమంలో భాగంగా వైభవంగా నృత్య ప్రదర్శనను నిర్వహించినట్లు పరిపాలనా అధికారి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. నగర పరిధిలోని ప్రజలు కార్యక్రమానికి హాజరై ఆసక్తిగా తిలకించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా జానపద, కూచిపూడి, నాటక ప్రదర్శనలు యువత ప్రదర్శించినట్లు చెప్పారు.
Similar News
News December 14, 2025
కడప జిల్లాలో పలువు సీఐల బదిలీ

కడప జిల్లాలో పలువురు సీఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జోన్‌లో మొత్తం 31 మంది సీఐలను ఆయన బదిలీ చేశారు. ప్రొద్దుటూరు టూటౌన్ సదాశివయ్య, త్రీటౌన్ వేణుగోపాల్, కడప వీఆర్ మోహన్, కమలాపురం రోషన్, ముద్దనూరు దస్తగిరి, కడప వీఆర్ నారాయణప్ప, కడప CCS కృష్ణంరాజు, LR పల్లె కొండారెడ్డి, కడప టూటౌన్ సుబ్బారావు ప్రస్తుత స్థానాల నుంచి బదిలీ అయ్యారు.
News December 14, 2025
లోక్ అదాలత్‌లో YSR కడప జిల్లాకు 3వ ర్యాంకు

జాతీయలోక్ అదాలత్లో రాష్ట్రంలోని YSR కడప జిల్లాకు 3వ ర్యాంకు లభించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 38,498 క్రిమినల్ కేసులు, 274 సివిల్ కేసులు, 348 ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించబడ్డాయన్నారు. ఇందులో రూ.32.43 కోట్ల మేర కక్షిదారులు చెల్లించినట్లు చెప్పారు.
News December 14, 2025
పుష్పగిరిలో వామన నరసింహ వరాహ స్వాముల కుడ్య శిల్పం

వల్లూరులోని పుష్పగిరి లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ గోడపై నిల్చున్న వామన నర్సింహ వరాహ స్వాముల కుడ్య శిల్పం విచిత్రంగా అద్భుతంగా ఉందని చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేశ్ ఆదివారం తెలిపారు. విష్ణుమూర్తి ధర్మ పరిరక్షణ కోసం చేసిన పది దశావతారాలలో మూడు అవతారాలను చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రదేశాలలో రాతిపై చెక్కడం కష్టమన్నారు.


