News November 7, 2025
కడప: శ్రీ చరణికి రూ.10 లక్షలు ప్రకటించిన ఎంపీ మేడా

వరల్డ్ కప్‌లో సత్తా చాటిన ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీ చరణికి రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి రూ.10 లక్షల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన చరణి చూపిన ప్రతిభ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. యువత అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఈ బహుమతి ప్రకటించానని ఆయన చెప్పారు.
Similar News
News January 17, 2026
నితీశ్ రెడ్డి ఆల్‌రౌండర్ కాదు: కైఫ్

NZతో ODI సిరీస్‌లో IND పిచ్‌కి తగ్గట్టు ప్లేయింగ్-11ని ఎంపిక చేయట్లేదని మాజీ క్రికెటర్ కైఫ్ అన్నారు. జట్టులో నితీశ్ రోల్ ఏంటో అర్థం కావడం లేదని తన YouTube వీడియోలో చెప్పుకొచ్చారు. ‘నితీశ్ ఆల్‌రౌండర్ కాదు. అతను బ్యాటర్ మాత్రమే. ఈ విషయాన్ని మేనేజ్‌మెంట్ వీలైనంత త్వరగా అర్థం చేసుకోవాలి. అతడిని బ్యాటర్‌గా డెవలప్ చేయాలి. పార్ట్ టైమ్ బౌలర్‌ను ఆల్‌రౌండర్ అనడం కరెక్ట్ కాదు’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
News January 17, 2026
కర్నూలు: సంక్రాంతి నాడు విషాదాంతాలు

సంక్రాంతి పండుగ నాడు పలు కుటుంబాల్లో విషాదం మిగిలింది. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద బైక్ ఢీకొని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతిచెందారు. పాణ్యం(M) తమ్మరాజుపల్లెలో వాహనం ఢీకొని రత్నమ్మ(50) మరణించింది. బేతంచెర్ల(M) శంకలాపురం గ్రామానికి చెందిన దస్తగిరి(33) బొలెరో ఢీకొని చనిపోయాడు. అప్పుల బాధతో గోనెగండ్లలో కౌలు రైతు జైనుద్దీన్, ఆదోనికి చెందిన వెంకటేశ్(42), కర్నూలుకు చెందిన శివకుమార్(33) ఉరేసుకున్నారు.
News January 17, 2026
అన్నమయ్య: టమాటా ధరలు ఢమాల్

మదనపల్లె టమాటా మార్కెట్లో 10 కిలోల బాక్స్ రూ.230 కి పడిపోయింది. శనివారం మార్కెట్ కు 72 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. 10 కిలోల మేలు రకం టమాటాలు – రూ 230, రెండవ రకం రూ – 220, మూడో రకం రూ.190తో కొనుగోలు చేసినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ వెల్లడించారు. టమాటా దిగుబడి తక్కువగా వస్తున్నప్పటికీ రేట్లు పెరగక పోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.


