News March 26, 2024
కడప: సీఎం వైఎస్ జగన్ పర్యటన వివరాలు

సీఎం జగన్ కడప జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం 12 :20 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం హెలికాఫ్టర్ లో బయలుదేరి 12:45కు ఇడుపులపాయకు చేరుకుంటారు. అనంతరం వైఎస్ఆర్ ఘాట్ వద్ద 1:20 వరకు ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొంటారు. 1:30 కు ఇడుపులపాయలో బయలుదేరి వేంపల్లి, వీఎన్ పల్లె, ఎర్రగుంట్ల మీదుగా రోడ్ షో నిర్వహిస్తూ ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
Similar News
News February 16, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.15,720
* 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.14,462
* వెండి 10 గ్రాముల ధర రూ.2,505.
News February 16, 2026
కడప: ఇవాళే లాస్ట్.. అప్లై చేశారా?

కడప డివిజన్ పరిధిలోని సావిశెట్టిపల్లి, వెంకటరెడ్డి పల్లితో పాటు 26 చోట్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని దొరసాని పల్లి, సిరిగే పల్లి, సుద్ధపల్లె తదితర గ్రామాల్లో 32 పోస్టులను భర్తీ చేస్తారు. జీతం రూ.12 వేల నుంచి రూ.24,470. పదో తరగతి పాసైతే చాలు. ఖాళీల వివరాల కోసం ఇక్కడ <
News February 16, 2026
కడప కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

కడప కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10:30 నుంచి కలెక్టర్ సభా భవనంలో కార్యక్రమం మొదలవుతుందన్నారు. అర్జీ దారులు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు. కడపతో పాటు అన్ని మున్సిపల్, మండల తహశీల్దార్ కార్యాలయాల్లో కూడా అర్జీలు స్వీకరిస్తారని ఆయన స్పష్టం చేశారు.


