News September 12, 2025
కడప: RI వీరేశంను సన్మానించిన ఎస్పీ

కడప జిల్లా పోలీసు శాఖకు RI వీరేశ్ ఎంతగానో సేవలు అందించాలని జిల్లా SP అశోక్ కుమార్ ప్రశంసించారు. శుక్రవారం బదిలీపై చిత్తూరుకు వెళ్తున్న ఆర్ఐ వీరేశ్‌కు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ అప్పగించిన విధులను సమర్ధవంతంగా నిర్వర్తించారన్నారు. వీఐపీల రాక సందర్భంలో ఆర్‌ఐ వీరేశ్ అంకితభావంతో విధులు నిర్వర్తించారన్నారు.
Similar News
News December 16, 2025
కడప జిల్లాలో దుమారం రేపిన CIల బదిలీలు.!

కడప జిల్లాలో CIల బదిలీలపై కూటమి ప్రజా ప్రతినిధులు మండిపడుతున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ముందు తమను సంప్రదించకుండా సీఐల బదిలీలు చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే ప్రొద్దుటూరు, ముద్దనూరు, కమలాపురానికి కొత్త సీఐలను నియమించారని దీనిపై ప్రొద్దుటూరు MLA వరద మండిపడుతున్నారు. CMOకు ఫిర్యాదు చేయడానికి ఆయన అమరావతికి వెళ్లినట్లు తెలుస్తోంది.
News December 16, 2025
కడప జిల్లాలో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్

కడప జిల్లాలో విండ్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు హెటిరో సంస్థకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లాలోని కొండాపురం మండలం టి.కోడూరులో 30 ఎకరాలు, చామలూరు గ్రామంలో 10 ఎకరాలు, కొప్పోలులో 5 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎకరాకు ఏడాదికి రూ.3 లక్షలు లీజు ప్రాతిపాదికన భూములు కేటాయించారు.
News December 15, 2025
కడప: డాక్టరేట్ అందుకున్న అధ్యాపకుడు

కడప డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి చెందిన యానిమేషన్ విభాగం అధ్యాపకుడు డా.ఉండేల శివకృష్ణా రెడ్డి డాక్టరేట్ అందుకున్నారు. చెన్నైలోని హిందుస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య బి.జయరామిరెడ్డి పట్టా అందజేసి అభినందించారు.


