News February 18, 2025
కడప: YVU వీసీగా ప్రకాశ్ బాబు

యోగి వేమన యూనివర్సిటీ నూతన ఉపకులపతిగా ప్రకాశ్ బాబును ఉన్నతాధికారులు నియమించారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక ఇన్‌ఛార్జ్ వైస్ చాన్సలర్లతో పరిపాలన కొనసాగిస్తున్నారు. యోగివేమన యూనివర్సిటీ నూతన వీసీగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సీనియర్ ప్రొఫెసర్ ప్రకాశ్ బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన మూడేళ్ల పాటు ఇక్కడ వీసీగా కొనసాగనున్నారు.
Similar News
News April 15, 2026
కడప: నేడు ఇంటర్ ఫలితాలు.. మార్కులే జీవితం కాదు.. బ్రో

కడప జిల్లాలో ఇంటర్-1, సెకండియర్ విద్యార్థులు 33,664 పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల సమయంలో కొందరు విద్యార్థులు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్ అయినా అది జీవితానికి ముగింపు కాదని, ఓటమి అనేది విజయానికి తొలి మెట్టని అధికారులు సూచిస్తున్నారు. <<19635802>>తల్లిదండ్రులు<<>>, ఉపాధ్యాయులు పిల్లలకు మానసికంగా అండగా నిలవాలని, అవసరమైతే విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
News April 15, 2026
కడప జిల్లాలో బెల్ట్ షాపులపై 47 కేసులు

కడప జిల్లా వ్యాప్తంగా మద్యం బెల్ట్ షాపులపై విస్తృతస్థాయిలో పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఒకేరోజు 47 కేసులు నమోదు చేశారు. 47 మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 579 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 554 క్వార్టర్ బాటిళ్ల మద్యం, 25 బీర్ బాటిళ్లు స్వాధీనపరుచుకున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశ్వనాథ్ హెచ్చరించారు.