News April 13, 2025

కడెం: ఉరేసుకొని యువతి ఆత్మహత్య

image

ఉరివేసుకొని యువతి మృతి చెందిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన అనూషను(21) శుక్రవారం సాయంత్రం ఓ విషయంలో తల్లి మందలించింది. మనస్తాపానికి గురై ఇంటి పక్కన ఉన్న షెడ్డులో ఉరేసుకుంది. అనూష తండ్రి రాజేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 11, 2026

GNT: ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు నందిగం సురేశ్

image

కాకినాడకు సంబంధించిన ఓ చర్చి ట్రస్ట్ రెన్యూవల్ కోసం మాజీ MP నందిగం సురేశ్ ఓ వ్యక్తి నుంచి రూ. 25 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ విజయవాడకు చెందిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సురేశ్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి ఈ నెల 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు.

News April 11, 2026

కాళేశ్వరం ప్రాజెక్ట్.. సీఎం టైం బాండ్ అతిపెద్ద సవాల్

image

మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో 2023 నుంచి సాంకేతిక లోపాలతో నీటి ఎత్తిపోతలు నిలిచిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులపై సమీక్షించిన సీఎం వానకాలంలోపు పూర్తిచేయాలని టైం బాండ్ పెట్టడంతో ఇరిగేషన్ శాఖ టెన్షన్ పడుతోంది. దెబ్బతిన్న బ్యారేజీలు, పంపు హౌస్‌లో సాంకేతిక సమస్యలు, క్లిష్టమైన ఇంజినీరింగ్ పనులు ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడుతోంది.

News April 11, 2026

పెనుముప్పుగా ప్లాస్టిక్

image

కోవెలకుంట్ల <<19621324>>ఘటన<<>> అందరినీ హెచ్చరిస్తోంది. ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయడంతో పశువులు తిని ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నాయి. పర్యావరణానికే కాకుండా మూగజీవాల మనుగడకు ప్లాస్టిక్ శాపంగా మారింది. ప్రతిఒక్కరూ బాధ్యతగా మెలగకపోతే ఇలాంటి దారుణాలు మరిన్ని జరుగుతాయి. ఇకనైనా ప్లాస్టిక్ వినియోగాన్ని విడనాడదాం. మన అజాగ్రత్తతో మూగజీవాల ప్రాణాలను బలి తీసుకోవద్దు. అప్రమత్తంగా ఉండి పర్యావరణాన్ని కాపాడుకుందాం.