News November 5, 2025
కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్

కడెం ప్రాజెక్ట్ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరింది. దీనికితోడు పరివాహక ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో వస్తున్న కారణంగా బుధవారం ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఓ ప్రకటనలో తెలిపారు. దిగువన నదీ పరివాహక ప్రాంతంలోకి పశువులు, గొర్రెలు వెళ్లకుండా పశుకాపరులు, రైతులు జాగ్రత్త వహించాలన్నారు. తదుపరి సూచనలు చేసే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారి కోరారు.
Similar News
News January 24, 2026
రూ.52 కోట్ల జరిమానాపై సంతృప్తి: బాపట్ల MP

ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అధికారులు పూర్తిగా అరికట్టాలని MP తెన్నేటి కృష్ణ ప్రసాద్ సూచించారు. గడిచిన మూడేళ్లలో అక్రమ తవ్వకాలపై రూ.52 కోట్లు జరిమానా విధించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. 3 మున్సిపాలిటీల్లో అమృత్-2 కింద నీటి ట్యాంకుల అభివృద్ధికి రూ.96.45 కోట్లు విడుదలయ్యాయన్నారు. ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ శాఖ ద్వారా పనులకు టెండర్లు పిలువగా, టెండర్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
News January 24, 2026
కాగజ్‌నగర్‌లో విషాదం.. భవానీ మృతి

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పరిధి భట్టుపల్లి గ్రామంలో జరిగిన <<18938568>>రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన<<>> రామగోని భవానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందిందని గ్రామస్థులు తెలిపారు. ప్రమాదం అనంతరం స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా గాయాలు తీవ్రమవడంతో ప్రాణాలు నిలువలేదు. భవానీ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News January 24, 2026
వరంగల్ మార్కెట్‌కి 3 రోజుల వరుస సెలవులు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం రిపబ్లిక్ డే సందర్బంగా మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి మూడు రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి మంగళవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.


