News March 4, 2025

కడెం: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని యువకుడి సూసైడ్

image

మద్యానికి ఇంట్లో డబ్బులు ఇవ్వడం లేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కడెంలో చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా తిప్ప గ్రామానికి చెందిన ఆత్రం నైకు కొద్దిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో తాగడానికి డబ్బులు ఇవ్వకపోవడంతో సోమవారం ఉడుంపూర్ అడవిలో ఉరేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News December 9, 2025

అమరావతిలో రూపుదిద్దుకుంటున్న AIS సెక్రటరీల బంగ్లాలు

image

అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీనికి ఉదాహరణ ఇప్పటికే అమరావతి ప్రాంతంలోని
రాయపూడి వద్ద నిర్మాణంలో ఉన్న AIS సెక్రటరీల బంగ్లాలు రూపుదిద్దుకోవడం. మొత్తం 90 బంగ్లాలు వస్తున్నాయి. వీటిలో ఒక్కొక్కటి 4,350 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఓ వైపు రాత్రింబవళ్లు ఐకానిక్ టవర్ల వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

News December 9, 2025

జనగామ: చెక్ పోస్టుల వద్ద నాఖాబందీ

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పెంబర్తి చెక్‌పోస్ట్ వద్ద నకాబంది, వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, న్యాయబద్దంగా సాగేందుకు ఈ తనిఖీలు చేపట్టామని డీసీపీ రాజమహేంద్రనాయక్ తెలిపారు. అక్రమ నగదు, మద్యం, ఆయుధాలు, రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏఎస్‌పీ పండరీ చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సైలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News December 9, 2025

నాగార్జున సాగర్‌లో విదేశీ ప్రతినిధుల సందడి

image

హైదరాబాద్‌లో జరుగుతున్న గ్లోబల్ సమిట్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులు సోమవారం బుద్ధవనాన్ని సందర్శించారు. నాగార్జునుడి బౌద్ధతత్వం, బుద్ధవనం నిర్మాణశైలి, ప్రత్యేకతలపై పరిశోధకుడు శివనాగిరెడ్డి వారికి వివరించారు. అనంతరం ప్రతినిధులు సాగర్ జలాశయంలో పర్యాటక శాఖ లాంచీలో గంటన్నరసేపు విహరించి ప్రకృతి సోయగాలను ఆస్వాదించారు. అంతర్జాతీయ అతిధుల సందర్శనతో సాగర్ పర్యాటకరంగానికి ప్రాచుర్యం దక్కింది.