News September 12, 2025
కడెం వరద గేట్లు ఎత్తే అవకాశం

కడెం పరివాహక ప్రాంతంలో( క్యాచ్మెంట్) వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉన్నందున శుక్రవారం రాత్రి కడెం ప్రాజెక్టు వరద గేట్లు నుంచి నీళ్లను వదిలే అవకాశం కడెం ప్రాజెక్టు నాల్గవ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తెలిపారు.
నదీ పరివాహక ప్రాంతంలోకి పశువులు, గొర్రెలు వెళ్లకుండా చూడాలన్నారు. పశువుల కాపరులు, రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News December 14, 2025
BHPL: ఉప సర్పంచ్ పదవిపై ఆశలు.. ముందస్తు వ్యూహాలు!

పంచాయతీలో వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న వారు ఉప సర్పంచ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. రెండో విడత 4 మండలాల్లో 75 పంచాయతీల్లో కొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. వార్డు సభ్యులు, సర్పంచ్ ఫలితం తేలిన వెంటనే వార్డు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తారు. మెజార్టీ సభ్యులు చేయి ఎత్తి మద్దతు తెలిపిన వ్యక్తి ఉప సర్పంచ్‌గా ఎన్నిక అవుతారు. కౌంటింగ్ జరుగుతుండగానే ఉప సర్పంచ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
News December 14, 2025
పెద్దపల్లి: మొత్తం పోలింగ్ 80.84%

పెద్దపల్లి జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 112,658 ఓటర్లలో 91,076 మంది ఓటు వేశారు. మొత్తం పోలింగ్ 80.84%గా నమోదయింది. అంతర్గాం మండలంలో అత్యధికంగా 86.40%, జూలపల్లి మండలం 84.75%, పాలకుర్తి మండలం 81.90%, ధర్మారం మండలం 75.57% పోలింగ్ నమోదు కాగా , ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై 1 గంట వరకు ముగిసింది. ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి.
News December 14, 2025
పెద్దపల్లి: పల్లెపోరులో గెలిచి నిలిచేదెవరో..?

పెద్దపల్లి జిల్లాలోని రెండో దశ పోలింగ్‌లో 4 మండలాల్లో జరిగిన పోలింగ్ ముగిసింది. మొత్తం 70 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 504 వార్డు స్థానాలకు జరిగిన ఈ పల్లెపోరులో ఎవరు గెలుస్తారో అనేది ఉత్కంఠంగా మారింది. కౌంటింగ్ ప్రక్రియ మొదలవడంతో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. మరి ఈ పల్లె పోరులో ఎవరు గెలుస్తారో కాసేపట్లో తెలుస్తుంది. మరింత సమాచారం కోసం Way2Newsను ఫాలో అవ్వండి.


