News February 27, 2025
కడెం: వ్యవసాయ బావిలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య…!

మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. SI కృష్ణసాగర్‌రెడ్డి కథనం ప్రకారం.. పాత మద్దిపడగ గ్రామానికి చెందిన బాతెం నర్సయ్య(67) మద్యానికి బానిసై ఇంట్లో తరచూ డబ్బులు అడిగేవాడు. ఈ క్రమంలో డబ్బులు ఇవ్వకపోవడంతో క్షణికావేశంలో వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి తెలిపారు.
Similar News
News February 27, 2025
లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని పరిశీలించిన WGL కలెక్టర్

వరంగల్ కలెక్టర్లో ఏర్పాటు చేసిన లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సరళిని జిల్లా కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. జిల్లాలో 13 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ కేంద్రాల ఓటింగ్ విధానంపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
News February 27, 2025
నల్గొండ: కల్లు గీస్తుండగా పాముకాటుతో మృతి

నార్కట్ పల్లి మండలం తొండల్ వాయికి చెందిన గీత కార్మికుడు దంతూరి శంకర్ బుధవారం సాయంత్రం పాముకాటుతో మరణించారు. గ్రామ సమీపంలోని తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా పాము కాటు వేసిందని, కిందికి దిగిన శంకర్ తోటి గీత కార్మికుడికి విషయం చెప్పి కిందపడిపోయాడని స్థానికులు తెలిపారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. శంకర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News February 27, 2025
ధర్పల్లి: చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

ధర్పల్లి మండలంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. SI రామకృష్ణ వివరాలిలా.. ధర్పల్లిలోని చెరువులో గురువారం ఉదయం స్థానికులు ఓ మృతదేహాన్ని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు 35- 40 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిగా గుర్తించామని, ఎవరైనా శవాన్ని గుర్తుపడితే పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని SI వెల్లడించారు.