News April 25, 2024
కతర్‌లో నిర్మల్ వాసి మృతి.. ఇంటికి చేరిన మృతదేహం
నిర్మల్ మండలంలోని కొరిటికల్ గ్రామానికి చెందిన గువ్వల రవి(23) సంవత్సరం క్రితం కతర్ దేశానికి ఉపాధి నిమిత్తం వెళ్ళాడు. అక్కడ వారం రోజుల క్రితం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. దీంతో అతడి స్నేహితుల సాయంతో రవి కుటుంబీకులు తెలంగాణ గల్ఫ్ సమితిని ఆశ్రయించి మృతదేహాన్ని గ్రామానికి చేర్చాలని కోరారు. యాజమాన్యంతో మాట్లాడిన అధికారులు బుధవారం మృతదేహాన్ని గ్రామానికి రప్పించారు.
Similar News
News January 17, 2025
ADB: 140 మహారాష్ట్ర దేశీదారు బాటిల్స్ స్వాధీనం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడకు చెందిన దినేష్ వద్ద 140 దేశీదారు సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ సీఐ సి.హెచ్. కరుణాకర్ రావ్ తెలిపారు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా దేశీదారు తీసుకొచ్చి ఆదిలాబాద్‌లో విక్రయించేందుకు ప్రయత్నించే క్రమంలో స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో దినేష్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడిపై కేసు నమోదు చేసి దేశీదారు బాటిల్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు.
News January 17, 2025
మందమర్రి: కారుణ్య నియామకాలతో 1806 కొలువులు
మందమర్రి ఏరియాలో నూతనంగా ఉద్యోగాలు పొందిన 8 మంది డిపెండెంట్లకు జీఎం దేవేందర్ గురువారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏరియాలో ఇప్పటివరకు కారుణ్య నియామకాల ద్వారా 1806 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. నూతన కార్మికులు క్రమం తప్పకుండా విధులకు హాజరై అధిక బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలని కోరారు. కష్టపడి పనిచేసి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
News January 17, 2025
సర్వే పారదర్శకంగా నిర్వహించాలి: ADB కలెక్టర్
లబ్ధిదారుల ఎంపికకు నిర్వహించే సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం ఆదిలాబాద్‌లోని అనుకుంటలో సర్వేను ఆయన మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పై సర్వే నిర్వహిస్తున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలను సేకరించారు. కమిషనర్ సీవీఎన్ రాజు, తదితరులున్నారు.