News November 6, 2025

కథలాపూర్: సబ్ స్టేషన్‌తో రేడియేషన్ ఉత్పత్తి కాదు: SE సుదర్శనం

image

కథలాపూర్‌లో నిర్మిస్తోన్న 220/132కేవీ సబ్ స్టేషన్ స్థలాన్ని విద్యుత్ శాఖ SE సుదర్శనం సందర్శించారు. సబ్ స్టేషన్ నిర్మాణంపై కొందరు వ్యక్తులు చేసిన ఆందోళనకు స్పష్టత ఇచ్చారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్లతో ఎలాంటి రేడియేషన్‌ ఉత్పత్తి కాదనీ, ప్రజల ఆరోగ్యానికి ఏ విధమైన హాని ఉండదని ఆయన తెలిపారు. విద్యుత్‌ ప్రసార వ్యవస్థల్లో ఉండే మాగ్నెటిక్‌ ఫీల్డ్‌ స్థాయిలు అంతర్జాతీయ ప్రమాణాలకు పూర్తిగా లోబడి ఉంటాయన్నారు.

Similar News

News January 19, 2026

CMERIలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

CSIR-సెంట్రల్ మెకానికల్ ఇంజినీర్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (<>CMERI<<>>)లో 20 టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్+ఐటీఐ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.37వేలు చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.cmeri.res.in

News January 19, 2026

ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి: కదిరి సీఐ

image

నల్లచెరువు (M) చవిటివారిపల్లి గ్రామానికి చెందిన సి.సాయి చరణ్ రెడ్డి (B.Tech) కదిరి టౌన్‌లో నివాసం ఉంటున్నారు. అతనికి లక్ష్మీపతి, షరీఫ్, చంద్ర పరిచయమై సాఫ్ట్‌వేర్ వర్క్ ఫ్రం హోం ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.3,50,000 ఆన్‌లైన్ పేమెంట్ చేయించుకుని మోసం చేసినట్లు వాపోయాడు. భాదితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

News January 19, 2026

మంచిర్యాల: ఆ ముగ్గురు ఎవరు..?

image

జిల్లాలోని 302 గ్రామపంచాయతీల్లో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ప్రతి పంచాయతీకి ముగ్గురు సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండటంతో రాజకీయ సందడి మొదలైంది. ముఖ్యంగా ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఈ పదవుల ద్వారా ఉనికిని చాటుకోవాలని చూస్తున్నారు. 306 పంచాయతీలు ఉన్న జిల్లాలో, ఎన్నికలు ముగిసిన చోట్ల ఆశావహులు తమ పార్టీ పెద్దల వద్ద పైరవీలు ముమ్మరం చేశారు.