News March 13, 2025

కథలాపూర్: స్కూల్ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామంలో జరిగింది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన ఎర్రయ్య (70) ఉదయం టీ తాగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు రివర్స్‌లో వెళ్తూ ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన ఎర్రయ్యను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలో మృతి చెందారన్నారు.

Similar News

News February 19, 2026

గుంటూరు మిర్చి యార్డులో సరకు రాక పెరుగుదల

image

గుంటూరు యార్డుకు మిర్చి టిక్కీల రాక బుధవారం పెరిగింది. మొత్తం 1,06,635 టిక్కీలు రైతులు తీసుకురాగా 1,02,831 విక్రయాలు జరిగాయి. నాణ్యతను బట్టి క్వింటాల్‌కు రూ.17,500 నుంచి రూ.24,500 వరకు ధర లభించింది. తక్కువ క్వాలిటీ సరకుకే ధర తగ్గిందని మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. ఉదయం ఒప్పుకున్న ధరకే బిడ్డింగ్ చేయాలని అధికారులు కమిషన్ దుకాణాలకు సూచించారు. ఎగుమతి వ్యాపారులపై వచ్చిన ఫిర్యాదులపై పర్యవేక్షణ పెంచారు.

News February 19, 2026

ట్రంప్ ఆదేశమే ఆలస్యం.. ఇరాన్‌పై దాడికి US ఆర్మీ సిద్ధం: CNN

image

ఇరాన్‌పై దాడి చేసేందుకు అమెరికా మిలిటరీ సర్వం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ వీకెండ్‌లోనే అటాక్ చేసే ఛాన్స్ ఉందని CNN తెలిపింది. 2003 ఇరాక్ యుద్ధం తర్వాత మిడిల్ ఈస్ట్‌లో US తన అతిపెద్ద ఎయిర్ పవర్‌ను మోహరించినట్లు పేర్కొంది. ట్రంప్ తన అడ్వైజర్లతో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఇరాన్ అణు కేంద్రాలే టార్గెట్‌గా ఈ దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News February 19, 2026

అమెరికా అమ్మాయి.. తిరుపతి అబ్బాయి లవ్

image

తిరుపతికి చెందిన BSNL రిటైర్డ్ ఉద్యోగి రాజేంద్రన్ పెద్ద కుమారుడు రికీ జోసెఫ్(35) ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు. అక్కడే PhD పూర్తి చేసి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అతడికి అమెరికా యువతి బ్రాండీ నొయెల్ల జెడ్(30)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆమె MS చదివి ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ చేస్తోంది. ఇరుకుటుంబాల పెద్దలు వారి ప్రేమను అంగీకరించడంతో బుధవారం వారికి ఎంగేజ్‌మెంట్ జరిగింది.