News February 28, 2025

కనగల్: వాగులో పడి బాలుడి దుర్మరణం

image

కనగల్‌ మండలం జీ యడవల్లి గ్రామ వాగులో పడి ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. ఏఎస్ఐ కే. నర్సింహా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పర్సనబోయిన బోపాల్- అరుణ దంపతుల చిన్న కుమారుడు చరణ్ తేజ్ (6) గురువారం సెలవు దినం కావడంతో పొలం వద్ద ఉన్న తండ్రి దగ్గరకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో వాగు నీటి గుంతలో పడి మరణించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 22, 2025

నల్గొండ: మద్యం మత్తులో మందుబాబు హల్చల్ 

image

గుర్రంపోడులో మద్యం మత్తులో మందుబాబు వీరంగం సృష్టించాడు. సుమారు అరగంట పాటు నల్గొండ – దేవరకొండ రహదారిపై అడ్డంగా పడుకున్నాడు. స్థానికులు అతడిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లడంతో ట్రాఫిక్ ఇబ్బంది తప్పింది. పోలీసులు ఘటనా స్థలం వద్దకు వచ్చినా మందుబాబు మత్తులో ఉండడంతో వెళ్లిపోయారు. అతను మరోసారి వచ్చి రచ్చ చేయగా అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. 

News March 22, 2025

నల్గొండ జిల్లాకు మిస్ వరల్డ్ పోటీదారులు

image

ఉమ్మడి NLGలోని పర్యాటక ప్రాంతాలను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నారు. మే12న నాగార్జునసాగర్‌కు, 15న పోచంపల్లి, యాదగిరిగుట్టకు సుందరీమణులు రానున్నారు. సాగర్‌లో బౌద్ధ సంస్కృతిని పరిచయం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఆ ప్రాంతానికి గుర్తింపు వచ్చేలా పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వీరి పర్యటన నేపథ్యంలో నేడు నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఉన్నతాధికారులు బుద్ధవనంలో సమావేశం నిర్వహించనున్నారు.

News March 21, 2025

టెన్త్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్‌లో ఉన్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్లతో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి కేటాయించిన విద్యార్థులు, హాజరైన విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి పాల్గొన్నారు.

error: Content is protected !!