News October 4, 2025
కపాస్ కిసాన్ యాప్ రైతులకు అవగాహన

డిజిటల్ టెక్నాలజీ వినియోగం ద్వారా రైతులు మధ్యవర్తుల దుర్వినియోగం నుంచి రక్షించబడతారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు అన్నారు. శనివారం భద్రాద్రి జిల్లా కలెక్టరేట్లో కిసాన్ యాప్ పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ యాప్ ద్వారా మార్కెట్ లావాదేవీలపై స్పష్టమైన సమాచారం తెలుసుకోవచ్చన్నారు. కపాస్ కిసాన్ యాప్ రైతుల చేతుల్లో సమాచార శక్తిని అందిస్తుందని, దీన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News January 20, 2026
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. భర్తను కడతేర్చేశారు: అనకాపల్లి DSP

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి భార్య కడతేర్చిన ఘటన అనకాపల్లి(D) చీడికాడ(M) తూరువోలులో జరిగింది. కొండమ్మకు, గణేష్‌తో వివాహేతర సంబంధం ఉంది. భర్త డేగల చిన్నకు ఇది తెలియడంతో అడ్డుతొలగించుకోవాలనుకున్నారు. పథకం ప్రకారం గణేశ్ తన స్నేహితుడితో కలిసి 14న బైక్‌తో గుద్ది చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. విచారణలో విషయం బయటపడగా నిందితులను అరెస్టు చేసినట్లు DSP శ్రావణి తెలిపారు.
News January 20, 2026
పోలవరం: అయ్యో.. ఈ పాపం ఎవరిది?

పోలవరం జిల్లా చింతూరు మండలంలో సోమవారం అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆ తల్లిదండ్రులు ఎవరో అప్పుడే పుట్టిన బిడ్డను కల్లేరు పంచాయతీ మధుగురు శివారున పొదల్లో పడేశారు. అటుగా వెళ్తున్న ఇద్దరు మహిళలకు కేకలు వినబడడంతో వెళ్లి చూడగా.. పొదల్లో ఆడ శిశువు ఉంది. వెంటనే ఐసీడీఎస్ సిబ్బంది సహాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు. సీడీపీవో ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ రమేశ్ తెలిపారు.
News January 20, 2026
సంగారెడ్డి: నేడు జిల్లాలో మంత్రి దామోదర్ పర్యటన

సంగారెడ్డి జిల్లాలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటించనున్నారని అధికారులు, పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.


