News April 22, 2024
కమలాపురంలో TDP అభ్యర్థి మార్పు?

కమలాపురంలో TDP అభ్యర్థిని మార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పుత్తా నరసింహారెడ్డికి కాకుండా కుమారుడు చైతన్యరెడ్డికి అధిష్ఠానం టికెట్ ఇచ్చింది. దీంతో పార్టీ శ్రేణుల్లో ఒకింత అసహనం ఏర్పడింది. ఆదివారం చంద్రబాబు జిల్లా నేతలకు బీఫారాలు ఇవ్వగా ఇందులో చైతన్య చంద్రబాబు వద్ద కమలాపురం సీటు తన తండ్రికి ఇస్తే బాగుంటుందని, దాని వలన చేకూరే లబ్ధిని వివరించారు. పరిశీలిస్తామని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.
Similar News
News December 13, 2025
తొండూరులో 9 మంది విద్యార్థులకు అస్వస్థత

తొండూరు మండలంలోని యాదవారిపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం మధ్యాహ్నం భోజనం తిన్న 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు విరేచనాలు అవుతుండడంతో తొండూరు 108 వాహనంలో చికిత్స నిమిత్తం పులివెందుల హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 13, 2025
వరంగల్‌లో బద్వేల్‌కు చెందిన ప్రొఫెసర్ సూసైడ్

కడప జిల్లా బద్వేల్‌కి చెందిన ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి వరంగల్ NITలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. శుక్రవారం ధర్మసాగర్ రిజర్వాయర్‌లో పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసును హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి కంప్యూటర్ విభాగంలో పని చేస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 13, 2025
కడప: నేడు నవోదయ ఎంట్రన్స్.. ఇవి పాటించండి.!

జవహర్ నవోదయ పాఠశాలల్లో ప్రవేశాలకు పరీక్ష రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఒక గంట ముందుగానే చేరుకోవాలని డిఇఓ శంషుద్దీన్ పేర్కొన్నారు. నేడు కడప జిల్లా వ్యాప్తంగా 2,616 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 14 కేంద్రాల్లో విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శనివారం ఉదయం 11:30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1:30 నిమిషాల వరకు పరీక్ష ఉంటుందని అన్నారు.


