News August 21, 2025
కమిటీల్లో అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యేలకు చోటు

విశాఖలో ఈనెల 30న జరిగే జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి జనసేన పార్టీ కమిటీలను ఏర్పాటు చేసింది. పలు కమిటీల్లో అనకాపల్లి జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలకు చోటు లభించింది. పబ్లిసిటీ కమిటీలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబును నియమించారు. మీడియా కోఆర్డినేషన్ కమిటీలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఆతిథ్యం కమిటీలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ నియమితులయ్యారు.
Similar News
News January 20, 2026
విజయ్‌తో పెళ్లి.. త్వరలో క్లారిటీ: రష్మిక

హీరో విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటారని జరుగుతున్న ప్రచారంపై హీరోయిన్ రష్మిక ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. ‘గత నాలుగేళ్లుగా కొన్ని రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. సరైన సమయం వచ్చినప్పుడే దాని గురించి మాట్లాడుతాను. అప్పుడే నిజం తెలుస్తుంది’ అని చెప్పారు. వచ్చే నెలలో వీరు పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్లు సినీ వర్గాలు తెలిపాయి.
News January 20, 2026
50% రాయితీతో వ్యవసాయ యంత్రాలు.. ఎలా అప్లై చేయాలి?

తెలంగాణలో సన్న, చిన్నకారు, మహిళా రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ‘వ్యవసాయ యాంత్రీకరణ’ పథకాన్ని తిరిగి ప్రారంభించింది. దీని కింద లబ్ధిదారులకు 40% నుంచి 50% రాయితీతో ఆధునిక యంత్రాలను అందిస్తారు. సంక్రాంతి నుంచి ఈ స్కీమ్ అమలవుతోంది. దీని వల్ల 1.30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకానికి అర్హతలు, రాయితీ, అందించే యంత్రాలు, దరఖాస్తు వివరాల కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.
News January 20, 2026
కడప: గుండెపోటుతోనే విజయకుమారి మృతి: ఏపీ ఫ్యాక్ట్ చెక్

సర్వేల పేరుతో వేధించడంతోనే కడపలో సచివాలయ ఉద్యోగిని జి.విజయకుమారి చనిపోయిందని వైసీపీ ట్వీట్ చేసింది. దీనిని ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ‘విజయకుమారి దీర్ఘకాలిక గుండె, ఊపిరితిత్తుల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె కోరిక మేరకు తన ఇంటికి సమీపంలోని సచివాలయానికి ప్రభుత్వం బదిలీ చేసింది. ఈనెల 18న గుండెపోటు రావడంతో ఆమె చనిపోయింది. ప్రభుత్వ వేధింపులతో అని తప్పుడు ప్రచారం చేయడం తగదు’ అని ట్వీట్ చేసింది.


