News August 22, 2024

కమ్మర్‌పల్లి ఫారెస్ట్‌లో చిరుత మృతి

image

కమ్మర్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో చిరుతపులి మృతి చెందిన ఘటన గురువారం వెలుగు చూసింది. ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ సమీపంలో చిరుతపులి చనిపోయి ఉందని పశువుల కాపరి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుత పులి 2 రోజుల క్రితం చనిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతంలోని చెరువు వద్ద అది 2 కూనలతో సంచరించినట్లు కాపరులు తెలిపారు.

Similar News

News January 19, 2026

NZB: కార్పొరేషన్, మున్సిపాలిటీలపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే: DCC

image

NZBమున్సిపల్ కార్పోరేషన్ తో పాటు జిల్లాలోని 3మున్సిపాలిటీలపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని DCC అధ్యక్షుడు నగేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన జిల్లా కాంగ్రెస్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ గత BRSప్రభుత్వ హయాంలో జిల్లాలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. అలాగే BJPకి చెందిన MP అర్వింద్ చేస్తున్న మత రాజకీయాలను విమర్శించారు. నగర కాంగ్రెస్ అద్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

News January 19, 2026

నిజామాబాద్: అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

image

రానున్న మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటుంది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న నేతలు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియను సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ప్రారంభించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి స్వయంగా దరఖాస్తులను స్వీకరించారు.

News January 19, 2026

మున్సిపల్ ఎన్నికలకు నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్‌గా ఉత్తమ్ కుమార్

image

రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రకటన విడుదల చేసింది. CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో రాష్ట్రంలో గడువు పూర్తైన 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.