News February 10, 2025

కరాటే పోటీల్లో సత్తా చాటిన మల్యాల బుడ్డోడు..

image

కల్కీ మూవీలో నటించిన చిన్నారి ఆణిముత్యం రసూల్ కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. మండలంలోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన టీ.మనివర్షిత్ (రసూల్) హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఇండోర్ గేమ్స్ ఇంటర్నేషనల్ ఓపెన్ టు ఆల్ స్టైల్స్ కరాటే పోటీల్లో ప్రతిభ కనబర్చాడు. ఈ సందర్భంగా రసూల్‌ను పలువురు అభినందిస్తున్నారు.

Similar News

News February 16, 2026

అభిషేక్ ఫ్లాప్ షో.. 6 మ్యాచుల్లో 4 డకౌట్స్

image

T20Iల్లో భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఫ్లాప్ షో నడుస్తోంది. T20WCలో ఆడిన 2 మ్యాచుల్లోనూ సున్నాకే వెనుదిరిగారు. అటు చివరి 6 మ్యాచుల్లో 4 సార్లు డకౌట్(0, 68*, 0, 30, 0, 0,) అయ్యారు. అభిషేక్ టాలెంట్‌పై సందేహం లేకపోయినా T20WCలాంటి పెద్ద వేదికల్లో ఇలా నిలకడ చూపకపోవడం ఆందోళన కలిగించే అంశం. అటు ఈ ఫార్మాట్లో భారత ఓపెనర్లలో అత్యధికంగా రోహిత్ 10సార్లు, ఆ తర్వాత అభిషేక్&రాహుల్ 5సార్లు డకౌట్ అయ్యారు.

News February 16, 2026

NZB: ప్రారంభమైన కార్పొరేటర్ల ప్రమాణస్వీకారాలు

image

నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం కార్పొరేషన్ కార్యాలయంలో గెలిచిన అభ్యర్థులతో స్పెషల్ ఆఫీసర్ ప్రమాణస్వీకారం చేయించారు. మొదటగా కాంగ్రెస్ తరఫున గెలిచిన ఒకటో డివిజన్ అభ్యర్థి అగ్గు బోజన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఆల్ఫాబెటికల్ ప్రకారం ఒక్కొక్కరితో ప్రమాణస్వీకారం చేయిస్తారు.

News February 16, 2026

ఖమ్మం: 20 ఏళ్ల తర్వాత ఇంటికి చేర్చిన ‘రోడ్డు ప్రమాదం’

image

తిరుమలాయపాలెం మండలం రాజారానికి చెందిన మందుల లాలు 20 ఏళ్ల కిందట ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఎట్టకేలకు ఒక రోడ్డు ప్రమాదం ఆయనను కుటుంబంతో కలిపింది. విజయవాడలో జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలైన లాలు ఆసుపత్రిలో చేరగా, పోలీసులు ఆయన వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడి, ఆయన క్షేమంగా సొంతింటికి చేరుకున్నారు. ఈ వింత సంఘటన స్థానికంగా అందరినీ ఆశ్చర్యపరిచింది.