News February 18, 2025
కరీంనగర్‌లో విషాద ఘటన

కరీంనగర్‌లో విషాద ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మల్యాల మండలం నూకపల్లి వాసి చెవులమద్ది స్రవంతి(29) 8నెలల గర్భిణి. ఆదివారం చెకప్‌కు జగిత్యాలకు వెళ్లగా హార్ట్, ఉమ్మనీరు ప్రాబ్లమ్ ఉందని HYDకి వెళ్లాలని వైద్యులు తెలిపారు. దీంతో ఆమెను KNRకు తరలించి, చికిత్స అందించినప్పటికీ లోపల బిడ్డ మృతిచెందాడు. వైద్యులు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే పరిస్థితి విషమించి స్రవంతి కూడా మరణించింది.
Similar News
News March 15, 2026
పాలమూరు: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్

కాచిగూడ-మదురై ప్రత్యేక రైలును రైల్వే శాఖ రెగ్యులరైజ్ చేసింది. KCG నుంచి తూత్తుకుడి వైపు వెళ్లే రైలు ఏప్రిల్ 6 నుంచి ప్రతి సోమవారం నడుస్తుంది. తూత్తుకుడి-కాచిగూడ వైపు వచ్చే సర్వీసు ఏప్రిల్ 8 నుంచి ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. 07191/07192 స్పెషల్ రైళ్ల స్థానంలో ఇకపై 17615/17616 నంబర్లతో ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి. షాద్‌నగర్, జడ్చర్ల, MBNR, వనపర్తి రోడ్, గద్వాల్ గుండా స్టాఫ్‌లు ఉన్నాయి.
News March 15, 2026
వారికి LPG సిలిండర్లు బంద్.. కేంద్రం ప్రకటన

పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లు ఉన్నవారికి ఎల్పీజీ సిలిండర్లు సప్లై చేయవద్దని కేంద్రం ఆదేశించింది. PNG వినియోగించుకుంటూనే డొమెస్టిక్ సిలిండర్లు తీసుకోవడం మంచిది కాదంది. వెంటనే LPG కనెక్షన్లు సరెండర్ చేయాలని స్పష్టం చేసింది. చమురు సంస్థలు వారికి కొత్తగా LPG కనెక్షన్లూ ఇవ్వొద్దని ఆదేశించింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో HYDతో పాటు విశాఖ, విజయవాడ, గుంటూరు, కడప తదితర నగరాల్లో PNG సౌకర్యం ఉంది.
News March 15, 2026
వైజాగ్ స్టీల్ సీఎండీగా ప్రభాకర్..!

విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ పదవికి MNVS.ప్రభాకర్ పేరును కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఆయన NMCS స్టీల్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. శనివారం న్యూఢిల్లీలో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సెర్చ్-కమ్-సెలెక్షన్ కమిటీ సమావేశంలో ఐదుగురిని ఇంటర్వ్యూ చేసి ప్రభాకర్‌ను ఎంపిక చేశారు. కేంద్ర ప్రభుత్వ తుది ఆమోదం తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు.


