News October 7, 2025
కరీంనగర్‌లో సరాసరి తగ్గిన 6 స్థానాలు..!

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణలో భాగంగా 6 గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. KNR(R) మండలం నుంచి బొమ్మకల్, దుర్షెడు, గోపాల్‌పూర్ గ్రామాలు, కొత్తపల్లి మం. మున్సిపాలిటీగా రూపాంతరం చెందగా చింతకుంట, మల్కాపూర్ గ్రామాలను కార్పొరేషన్‌లో చేర్చారు. ఈ పరిణామంతో కరీంనగర్ జిల్లాలో సరాసరి 6 MPTC స్థానాలు తగ్గాయి. కాగా, విలీన గ్రామాల ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Similar News
News January 20, 2026
నితీష్ ఫెయిలైనా అవకాశాలివ్వాలి: ఇర్ఫాన్ పఠాన్

NZతో జరిగిన మూడో వన్డేలో నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నారు. దీనిపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్ నితీష్‌ను హార్దిక్ పాండ్యాకు సరైన బ్యాకప్‌గా అభివర్ణించారు. 135km వేగంతో బౌలింగ్, భారీ షాట్లు కొట్టగల బ్యాటింగ్ సామర్థ్యం అతనికి ఉందన్నారు. వరుసగా ఫెయిలైనా మరిన్ని అవకాశాలివ్వాలని సూచించారు. కోహ్లీతో కలిసి నితీష్ నెలకొల్పిన 88 పరుగుల భాగస్వామ్యం అతని టాలెంట్‌కు నిదర్శనమని పేర్కొన్నారు.
News January 20, 2026
అనకాపల్లి: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. భర్తను కడతేర్చేశారు

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి భార్య కడతేర్చిన ఘటన అనకాపల్లి(D) చీడికాడ(M) తూరువోలులో జరిగింది. కొండమ్మకు, గణేష్‌తో వివాహేతర సంబంధం ఉంది. భర్త డేగల చిన్నకు ఇది తెలియడంతో అడ్డుతొలగించుకోవాలనుకున్నారు. పథకం ప్రకారం గణేశ్ తన స్నేహితుడితో కలిసి 14న బైక్‌తో గుద్ది చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. విచారణలో విషయం బయటపడగా నిందితులను అరెస్టు చేసినట్లు DSP శ్రావణి తెలిపారు.
News January 20, 2026
PDPL: ‘వడ్డీ లేని రుణాల పంపిణీ వేగిరం చేయాలి’

పట్టణ ప్రాంతాల్లో మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. సోమవారం PR మంత్రి సీతక్కతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన సమీక్ష సమావేశంలో PDPL కలెక్టర్ శ్రీ హర్ష పాల్గొన్నారు. ఇందిరమ్మ చీరల పట్ల మహిళల నుంచి మంచి స్పందన వస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళలకు సత్వరం చీరల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాల జారీ చేశారు.


