News August 20, 2025
కరీంనగర్: అవుట్ సైడ్ స్వీట్స్ తింటున్నారా..తస్మాత్ జాగ్రత్త

రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు KNRలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నేడు టవర్ సర్కిల్ లో స్వీట్ షాపులను తనిఖీచేశారు.అనిల్ స్వీట్స్& బేకరీ, ఆనంద్ స్వీట్స్,మహారాజా స్వీట్ హౌస్‌లలో అనేక లోపాలు బయట పడ్డాయి.స్వీట్స్ తయారీ కిచెన్ ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, నిల్వ ఉంచిన స్వీట్స్‌పై బల్లి మలం గుర్తించామని అధికారులు తెలిపారు. కలుషితమైన పాలు, అధిక పరిమాణంలో కృత్రిమ రంగుల వాడకం వంటివి గుర్తించారు.
Similar News
News January 18, 2026
విశాఖ: నేవీ కార్యక్రమాలపై సీపీ సమీక్ష

విశాఖలో ఫిబ్రవరి 14 నుంచి 25 వరకు జరగనున్న ఐ.ఎఫ్.ఆర్, మిలాన్, ఐయాన్స్-కాన్ క్లెవ్ కార్యక్రమాలపై పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి నేవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో భద్రత, ట్రాఫిక్ మేనేజ్మెంట్, నో-డ్రోన్ జోన్, పార్కింగ్‌పై కీలక చర్చలు జరిపారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు నోడల్ ఆఫీసర్లను నియమించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చెయ్యాలని అధికారులను ఆదేశించారు.
News January 18, 2026
సూర్యాపేట: గవర్నర్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన

SRPT జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ నరసింహ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. గవర్నర్ KDDలో నవోదయ పాఠశాల, HNRలో అగ్రికల్చర్ కళాశాల భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. ఈ పర్యటన విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేసి, పక్కాగా భద్రత, ప్రొటోకాల్ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.