News February 7, 2025
కరీంనగర్: ఈనెల 17 నుంచి MBA, MCA పరీక్షలు

KNR శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని MBA, MCA మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా. ఎన్. వి శ్రీ రంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, MCA థియరీ పరీక్షలు 22న, MBA థియరీ పరీక్షలు 24 న ముగియనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.
Similar News
News February 19, 2026
వంటింటి చిట్కాలు మీ కోసం

* కూరగాయలు వడలిపోయినట్టు అయితే, నీటిలో వేసి నిమ్మరసం పిండితే కాసేపటికి తాజాగా మారతాయి. * వంటకాల్లో ఉల్లివాసన ఎక్కువగా రాకుండా ఉండాలంటే వాటిని వేయించే ముందు కొద్దిగా పంచదార వేయాలి. * పూరీలు మృదువుగా రావాలంటే పిండిని వేడి నీళ్ళూ, పాలతో కలిపి అరగంట సేపు రుమాలులో చుట్టి ఉంచాలి. * పెరుగు త్వరగా పులవకుండా ఉండాలంటే, తోడుకున్నాక దానిపై ఒకటి రెండు చిన్న కొబ్బరి ముక్కల్ని ఉంచండి.
News February 19, 2026
సిద్దిపేట: రూ.500 గ్యాస్ రాయితీ.. ఎదురుచూపులు!

సిద్దిపేట జిల్లాలో వంట గ్యాస్ వినియోగదారులు రూ.500 రాయితీ డబ్బులు కోసం 6 నెలలుగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలో మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500లకే గ్యాస్‌ను అమలు చేస్తుంది. అయితే పథకం ప్రారంభంలో ఖాతాల్లో రాయితీ డబ్బులు జమ చేసినా 6 నెలలుగా జమ కావడం లేదని పలువురు లబ్ధిదారులు పేర్కొన్నారు. జిల్లాలో 79 వేల లబ్ధిదారులు ఉన్నారు. మరి మీకు సబ్సిడీ పడుతుందా కామెంట్.
News February 19, 2026
గర్ల్‌ఫ్రెండ్‌తో పూల్‌లో హార్దిక్ పాండ్య.. ఫొటో వైరల్

తన గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మకు బర్త్‌డే విషెస్ చెబుతూ క్రికెటర్ హార్దిక్ పాండ్య పోస్ట్ చేసిన ఫొటో వైరలవుతోంది. స్విమ్మింగ్ పూల్‌లో ఆమెతో క్లోజ్‌గా ఉన్న ఫొటోను హార్దిక్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే మై ప్రిన్సెస్’ అని పేర్కొన్నారు. కాగా గత ఏడాది OCTలో మహీకాతో రిలేషన్‌షిప్‌ను హార్దిక్ కన్ఫర్మ్ చేశారు. అప్పటి నుంచి ఆమెతో కలిసి తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.


