News February 8, 2025

కరీంనగర్ ఎమ్మెల్సీ నామినేషన్‌లో కామారెడ్డి ఎమ్మెల్యే

image

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా చిన్నమైల్ అంజిరెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు బాస జనార్దన్ రావులతో కలిసి కలెక్టర్ పమేల సత్పత్తికి అంజిరెడ్డి మొదటి సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు.

Similar News

News February 12, 2026

తాగునీటి సమస్యనా? ఫోన్ చేయండి

image

అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు డీపీఓ నాగరాజ నాయుడు తెలిపారు. నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురైతే ప్రజలు 9701745437 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. అందిన సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

News February 12, 2026

దోస పంటలో బోరాన్ లోప నివారణకు సూచనలు

image

దోస పంటలో బోరాన్ లోప లక్షణాలను గమనిస్తే లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అవసరాన్ని బట్టి ఎకరాకు 10 కిలోల బోరాక్స్‌ను దుక్కిలో వేసుకోవాలి. దీని వల్ల పంటలో మగ పువ్వులు తగ్గి దిగుబడిని పెంచే ఆడ పువ్వుల సంఖ్య పెరుగుతుంది. దీని వల్ల ఆశించిన దిగుబడి సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

News February 12, 2026

సీలేరు పవర్ ప్లాంట్‌లో విద్యుత్ షాక్‌కి ఉద్యోగి మృతి

image

సీలేరులోని ఏపీ జెన్‌కో పవర్ ప్లాంట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఒప్పంద లైన్‌మెన్‌గా గణేశ్ గురువారం విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షాక్‌కి గురయ్యాడు. తీవ్ర గాయాలపాలైన ఆయనకు స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి చింతపల్లి సామాజిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు.