News February 7, 2025
కరీంనగర్: ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన వి.నరేందర్ రెడ్డి

ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్,మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వి.నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాశక్తి దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కుటుంబసభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
Similar News
News February 7, 2026
ఆరోగ్యంగా ఉంటేనే విధుల్లో రాణించగలరు: ఎస్పీ

పోలీసులకు విధి నిర్వహణ ఎంత ముఖ్యమో ఆరోగ్య పరిరక్షణ, క్రమశిక్షణ, ఫిట్నెస్ కూడా అంతే ముఖ్యమని ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన వీక్లీ పరేడ్‌లో మాట్లాడారు. సిబ్బంది సమయం దొరికినప్పుడు వ్యాయామం చేయాలని, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలన్నారు. ఫిట్నెస్‌తోనే సమర్థవంతంగా విధులు నిర్వహించగలమని, మంచి జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
News February 7, 2026
నిర్మల్: సీనియర్ లీడర్స్ ఫుల్ యాక్షన్ మోడ్!

నిర్మల్ మున్సిపల్ ఎన్నికల్లో సీనియర్ నాయకులు ప్రచార వేగాన్ని పెంచారు. వార్డు స్థాయిలో సమావేశాలు, కార్యకర్తలతో సమన్వయం, ఇంటింటి ప్రచారం ద్వారా అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు. అభివృద్ధి అంశాలను ప్రస్తావిస్తూ ఓటర్ల మద్దతు కోరుతున్నారు. పార్టీ వర్గాలు ఈ ప్రచారం ఫలితాలపై సానుకూలంగా స్పందిస్తున్నాయి. అయితే స్థానిక సమస్యలు, ప్రత్యర్థుల వ్యూహాలు కూడా ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.
News February 7, 2026
కొత్తకోట బరిలో భార్యాభర్తలు

వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. మున్సిపల్ 10వ వార్డు నుంచి అడ్వకేట్ యాదగిరి పోటీ పడుతుండగా, 11వ వార్డు నుంచి ఆయన భార్య శ్రీలత బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచారు. మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో పదవిని దక్కించుకోవాలని శ్రీలత ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్‌లో ఈ దంపతుల రాజకీయ భవిష్యత్తు తేలనుంది.


