News April 1, 2024
కరీంనగర్: కాంగ్రెస్ MP టికెట్ ఎవరికీ?

కరీంనగర్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ ఎంపీ అభ్యర్థిని ప్రకటించగా కాంగ్రెస్ మాత్రం రోజుకొక పేరుతో చర్చలో నిలుస్తోంది. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం నేడు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఇద్దరు సీనియర్ లీడర్లే మరి కాంగ్రెస్ టికెట్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.
Similar News
News February 18, 2026
KNR: ‘మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత’

మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం అధికారులు, యువత, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘నార్కో కోఆర్డినేషన్’ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మత్తుమందులు విక్రయించే మెడికల్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇప్పటివరకు 37 కేసులు నమోదు చేసి, 87 మందిని అరెస్ట్ చేశామన్నారు.
News February 18, 2026
KNR: ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ పమేలా సత్పత్తి బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును ఆమె పర్యవేక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గోదాం వద్ద విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
News February 18, 2026
కరీంనగర్: ‘విష’ ప్రయోగం.. 50 కోళ్లు మృత్యువాత!

కరీంనగర్ జిల్లా ఊటూర్‌లో మానవత్వం మంటగలిసింది. గుర్తుతెలియని వ్యక్తులు కోళ్ల దాణాలో విషం కలపడంతో 50 నాటుకోళ్లు ప్రాణాలు కోల్పోయాయి. స్వయం ఉపాధి కోసం వీటిని పెంచుతున్న నిరుద్యోగి జలంధర్ రెడ్డికి సుమారు ₹70వేల నష్టం వాటిల్లింది. పశువైద్యులు విషప్రయోగాన్ని ధృవీకరించగా, బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. నోరులేని జీవాలను పొట్టనబెట్టుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.


