News July 17, 2024
కరీంనగర్ జిల్లాలో 36,918కి రుణ మాఫీ

కరీంనగర్ జిల్లాలో 36,913 మందికి రుణ మాఫీ కానుంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాలో నియోజకవర్గాల వారిగా కరీంనగర్ 2,536 మంది రైతులకు, చొప్పదండి 8,436, హుజురాబాద్ 12,502, మానకొండూర్13,381 మంది రైతులకు రుణమాఫీ కానుంది. రేపు రైతుల ఖాతాల్లో జమకానున్నట్లు జిల్లా వ్యవసాయాధికారులు తెలిపారు. మాఫీపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 6, 2025
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న జబర్దస్త్ నటులు

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నను గురువారం జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు మహా మండపంలో వేదోచ్చరణతో స్వాగతం పలికి, శేష వస్త్రంతో సత్కరించి, లడ్డు ప్రసాదం అందజేశారు. అంజన్నను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని వారు అన్నారు
News February 6, 2025
వేములవాడ: రాజన్న సేవలో జబర్దస్త్ నటులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని గురువారం జబర్దస్త్ నటులు సుడిగాలి సుదీర్, ఆటో రామ్ ప్రసాద్‌లు దర్శించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, అందరూ బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు.
News February 6, 2025
రాజన్న సిరిసిల్ల: మహిళ ఫొటోలు, వీడియోలు తీసిన వ్యక్తి అరెస్ట్..

స్నానం చేస్తుండగా మహిళ ఫొటోలు, వీడియోలు చిత్రీకరించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు కోనరావుపేట ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన బత్తుల అంజయ్య ఓ మహిళ స్నానం చేస్తుండగా తన సెల్ ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీశాడని బాధిత మహిళ పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మహిళా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.