News April 11, 2024
కరీంనగర్: నిబంధనలు పాటించని ఉపాధ్యాయుడి సస్పెండ్

కరీంనగర్‌లో నిర్వహిస్తున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రంలో నిబంధనలు పాటించని కరీంనగర్ సవరన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల తెలుగు పండిట్ ఆర్. చంద్రశేఖర్ రావును సస్పెండ్ చేశారు. మూల్యాంకన విధుల్లో చరవాణి మాట్లాడుతున్నందుకు ఆయన్ని వెంటనే సస్పెండ్ చేస్తూ క్యాంపు ఆఫీసర్, డిఇఓ జనార్దన్ రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News December 17, 2025
కరీంనగర్ జిల్లాలో 86.42% పోలింగ్ నమోదు

కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 5 మండలాల్లో తుది పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 86.42% పోలింగ్ కాగా, ఇల్లందకుంటలో 87.05%, హుజూరాబాద్ లో 85.94%, జమ్మికుంటలో 85.72%, వీణవంకలో 85.87%, సైదాపూర్ లో 87.85% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. మొత్తం 111 గ్రామ పంచాయితీల్లో 165046 ఓట్లకు గాను 142637 ఓట్లు పోలయ్యాయి.
News December 17, 2025
కరీంనగర్ జిల్లాలో తొలి ఫలితాన్ని ప్రకటించిన అధికారులు

ఇల్లందకుంట మండలం బోగంపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాన్ని అధికారులు వెల్లడించారు. గ్రామంలోని ఎనిమిది వార్డులకు గాను ఏడు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన ఒక్క వార్డుకు బుధవారం పోలింగ్ నిర్వహించారు. లెక్కింపు పూర్తికావడంతో విజేతను ప్రకటించి, జిల్లాలోనే తొలి ఫలితంగా నిలిపారు. సర్పంచ్ స్థానం ఇదివరకే ఏకగ్రీవం కాగా, ఇప్పుడు వార్డు సభ్యుల ఎన్నిక పూర్తి కావడంతో ఉపసర్పంచ్ పదవిని ఎవరు దక్కించుకుంటారో చూడాలి.
News December 17, 2025
కరీంనగర్ జిల్లాలో మండలాల వారీగా పోలింగ్ ఎంతంటే..?

కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఐదు మండలాల్లో కలిపి 84.35 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 110 గ్రామ పంచాయతీల్లో 1,65,046 మంది ఓటర్లు ఉండగా, 1,39,222 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలాల వారీగా ఇల్లంతకుంటలో 85.35%, హుజురాబాద్‌లో 85.06%, జమ్మికుంటలో 82.10%, వీణవంకలో 82.39%, వి.సైదాపూర్‌లో అత్యధికంగా 87.46% పోలింగ్ నమోదైంది.


