News February 11, 2025
కరీంనగర్: నేటి నుంచి భాగ్యనర్ ఎక్స్‌ప్రెస్

కరీంనగర్ జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11 రోజులు రద్దు కావాల్సిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈనెల 11 నుంచి 14 వరకు పునరుద్ధరించినట్లు రైల్వే అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. నేడు SECలో బయల్దేరి కాజీపేట మీదుగా కాగజ్‌నగర్(ఈనెల11 నుంచి 14)కు వెళ్తుందని, మళ్లీ 12న కాగజ్‌నగర్ నుంచి SEC(ఈనెల 12-15)వరకు నడపనున్నట్లు అధికారులు ఉత్తర్వులో పేర్కొన్నారు.
Similar News
News February 16, 2026
కరీంనగర్ మేయర్ పీఠంపై సందిగ్ధత!

కరీంనగర్ నగరపాలక సంస్థలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. మేయర్ పీఠం దక్కించుకునేందుకు బీజేపీకి 34 ఓట్ల బలం ఉండగా, కాంగ్రెస్ కూటమికి 35 ఓట్లు ఉన్నట్లు భావించారు. అయితే, అనూహ్యంగా బీఆర్ఎస్ మద్దతు ఉపసంహరించుకున్నట్లు జరుగుతున్న ప్రచారంతో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ సహకరించని పక్షంలో మేయర్ పీఠం కమలం వశమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
News February 16, 2026
కరీంనగర్ బల్దియాలో కొలువుదీరనున్న కొత్త పాలకవర్గం

కరీంనగర్ నగరపాలక సంస్థ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12:30 గంటలకు పరోక్ష ఎన్నిక నిర్వహించనున్నట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. ఎన్నికల దృష్ట్యా సోమవారం మధ్యాహ్నం వరకు పౌర సేవలను నిలిపివేశారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షిస్తామని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
News February 15, 2026
KNR: ‘కమిషనరేట్’ పరిధిలో ఆంక్షలు.. 144 సెక్షన్ అమలు

కరీంనగర్ MCK పరోక్ష ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 163 BNSS (సెక్షన్ 144) అమలు చేస్తున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. సోమవారం ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం విధించారు. శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.


