News December 1, 2025

కరీంనగర్: ప్రచారంలో అభ్యర్థుల పాట్లు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేయుచున్న అభ్యర్థులు వారి గెలుపు కోసం పాట్లు పడుతున్నారు. ఉదయం నుంచి గ్రామంలో తిరుగుతూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరినీ చాయ్ తాగినావా? తిన్నవా? మంచిదేనా? ఎటు పోతున్నావ్ అంటూ తదితర ముచ్చట్లు పెడుతూ చివరకు తాను గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్‌కు లేదా వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నానని, జర నాకు ఓటు వేసి గెలిపించండని ప్రాధేయపడుతున్నారు.

Similar News

News February 19, 2026

MBNR: అంబేడ్కర్ వర్సిటీ 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ ప్రారంభం

image

మహబూబ్‌నగర్ MVS ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సైన్స్, కంప్యూటర్ విద్యార్థులకు 5వ సెమిస్టర్ ప్రయోగ తరగతులు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. 80% హాజరు ఉన్న విద్యార్థులనే అనుమతిస్తారని ప్రిన్సిపల్ డాక్టర్ కె.పద్మావతి తెలిపారు. మరిన్ని వివరాలకు 73829 29609 నంబరును సంప్రదించాలని రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ జి. సత్యనారాయణ గౌడ్ సూచించారు.

News February 19, 2026

వనపర్తి: ‘ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి’

image

వనపర్తి జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను నిబంధనల మేరకు, పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ యాదయ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బోర్డు సూచనల ప్రకారం పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ అధికారి అంజయ్య, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News February 19, 2026

తెలుగు రాష్ట్రాల తీరుపై CWC అసంతృప్తి

image

TG: జలవివాదాల పరిష్కారంలో తెలుగు రాష్ట్రాల వైఖరిపై CWC అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముందుగా ఇవ్వాల్సిన అజెండాను AP, TG పంపకపోవడంతో JAN 30న జరిగిన భేటీ నిర్ణయాలు లేకుండానే ముగిసింది. తదుపరి భేటీకి 10 రోజుల్లో అజెండా పంపిస్తామని రెండూ అప్పట్లో చెప్పాయి. అయితే 20 రోజులైనా వాటి జాడలేదు. దీనిపై కమిషన్ సీరియస్‌ అయినట్లు సమాచారం. దీనిపై TG అధికారులు స్పందిస్తూ నెలాఖరుకు అందిస్తామని తెలిపారు.