News February 26, 2025

కరీంనగర్: ప్రయాగరాజ్ వెళ్లి వస్తూ చనిపోయాడు..!

image

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. వీణవంక మండల కేంద్రానికి చెందిన గౌడ సంఘం సభ్యుడు నల్లగోని వీరయ్య ఇటీవల యూపీలోని ప్రయాగరాజ్‌కు వెళ్లి కుంభమేళాలో పాల్గొని శివయ్యను దర్శించుకున్నాడు. తిరిగి వాహనంలో వస్తున్న క్రమంలో మంగళవారం అర్ధరాత్రి నిజామాబాద్ పట్టణంలోకి రాగానే అతడికి హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయాడు.

Similar News

News March 20, 2025

మెదక్: 24న సీజ్ చేసిన బియ్యం వేలం

image

పౌర సరఫరాల శాఖ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో సీజ్ చేసిన బియ్యాన్ని వేలం నిర్వహిస్తున్నట్లు మెదక్ జిల్లా పౌర సరఫరాల అధికారి పేర్కొన్నారు. 6a కేసు కింద సీజ్ చేసి నిల్వ ఉంచిన బియ్యాన్ని వేలం ఈనెల 24న ఉదయం 10 గంటలకు వేలం నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనేవారు 22 సాయంత్రం 5 గంటలలో లోపు రూ.2500 డిపాజిట్ చేయాలని సూచించారు. అత్యధిక వేలం దారులకు బియ్యాన్ని అమ్మనున్నట్లు చెప్పారు.

News March 20, 2025

జుక్కల్: అనుమానస్పదంగా వ్యక్తి మృతి

image

జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలో మున్నూరు కాపు బిచ్కుంద భూమయ్య అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గ్రామస్థులు చెప్పారు. గ్రామస్థుల కథనం ప్రకారం.. తండ్రి భూమయ్య కొడుకుతో కొద్దిపాటి వాగ్వివాదం జరిగిన అనంతరం ఉరేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కానీ అది ఆత్మహత్యగా కనిపించడం లేదంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 20, 2025

ధర్మపురి: రథోత్సవంలో జేబుదొంగ

image

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవంలో ఓ జేబుదొంగ పోలీసులకు చిక్కాడు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవం కొనసాగింది. రథాల వద్ద ఉన్న ఓ భక్తుని జేబులో చేయి పెడుతుండగా అక్కడే ఉన్న గొల్లపల్లి ఎస్ఐ సతీష్ గమనించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. వెంటనే సదరు వ్యక్తి జేబును వెతకగా జేబులో నుంచి దాదాపు నాలుగైదు పర్సులు, కొంత నగదు లభించాయి. వెంటనే జేబుదొంగను స్టేషన్ కు తరలించారు.

error: Content is protected !!