News September 12, 2025
కరీంనగర్: మోట ఫండ్ పేరిట భారీ మోసం.. నిందితుల అరెస్ట్

KNR జిల్లాలో మోట ఫండ్ అనే నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ కంపెనీ పేరుతో ప్రజలను మోసగించిన నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు ఈరోజు తెలిపారు. HYDకి చెందిన లోకేశ్వర్‌రావు అనే వ్యక్తితో KNRకు చెందిన శ్రీధర్, ప్రకాశ్, రమేశ్, రాజు కలిసి 8 మంది బాధితుల నుంచి రూ.54,65,000 వసూలు చేసి, మోసం చేశారని, నలుగురిని అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. ప్రధాన నిందితుడు లోకేశ్వర్‌రావు పరారీలో ఉండగా త్వరలో పట్టుకుంటామన్నారు.
Similar News
News December 10, 2025
AP న్యూస్ రౌండప్

*58,204మంది అంగన్వాడీ వర్కర్లకు 5G ఫోన్స్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి
*ఉచిత సివిల్స్ కోచింగ్‌కు మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం 100మంది ఎంపిక: మంత్రి సవిత
*రైతుల నుంచి MSPకి కొన్న ప్రతి గింజను వేగంగా రైళ్లలో FCI గోదాములకు తరలిస్తున్నాం: మంత్రి నాదెండ్ల మనోహర్
*ఏపీ టెట్ స్కూల్ అసిస్టెంట్(తెలుగు)- 2A పరీక్షకు 2 సెషన్స్‌లో కలిపి 17,181మంది అభ్యర్థులు హాజరు
News December 10, 2025
సూర్యాపేట: విషాదం.. యువకుడి ప్రాణం తీసిన కుక్క..!

ఆత్మకూర్(ఎస్) మండలం బొప్పారంలో రేబిస్ వ్యాధి లక్షణాలతో వ్యక్తి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పరాల సతీశ్(34)ను 8 నెలల క్రితం కుక్క కరిచింది. చికిత్స కోసం ఆత్మకూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా అక్కడ ఇంజెక్షన్ అందుబాటులో లేకపోవడంతో వేయించుకోలేదు. ఇటీవల అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు.
News December 10, 2025
సంగారెడ్డి: విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: ఎస్పీ

గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గురువారం ఎన్నికల నిర్వహన, ఫలితాలు పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు. తర్వాత విజయోత్సవ ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదన్నారు.


