News August 14, 2025
కరీంనగర్: మోడల్ స్కూల్ పీఈటీల సస్పెండ్: కలెక్టర్

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మోడల్ స్కూల్‌లో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన పీఈటీలు మోహన్, తిరుపతిలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్ట్ నిబంధనల మేరకు వారిని విధుల నుంచి తొలగించారు. ఈ విషయమై స్కూల్ ప్రిన్సిపాల్ సరిత, ఇంగ్లీష్ పీజీటీ కనక లక్ష్మిని సస్పెండ్ చేయాలని సిఫారసు చేశారు.
Similar News
News March 7, 2026
Way2News ప్రజాగళం.. వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకోండి!

ప్రజా గొంతుకగా Way2News నిలుస్తోంది. మీ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నెలకొన్న ప్రజా సమస్యలు, అక్రమాలు, అవినీతి, భూకబ్జాలు, ఇతర మోసాలపై మీరు ఎప్పటికప్పుడు Way2News ప్రజాగళం TG వాట్సాప్ నంబర్ 7995975252కు ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని పంపించవచ్చు. వాటిని ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసేలా పబ్లిష్ చేసి, పరిష్కారానికి కృషి చేస్తాం.
గమనిక: ఈ నంబర్ వాట్సాప్‌కు మాత్రమే, ఫోన్ కాల్ పనిచేయదు.
News March 7, 2026
అమలాపురం: పోలీసుల ‘ఆపరేషన్ వజ్రప్రహార్’

అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా శనివారం పోలీసులు భారీ స్థాయిలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. SP రాహుల్ మీనా ఆదేశాలతో అమలాపురం, రావులపాలెం, పామర్రు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ, నేరస్థుల ఆటకట్టించడానికి ఏకకాలంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ప్రజా భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా కీలక ప్రాంతాలను పోలీసులు దిగ్బంధించి సోదాలు జరిపారు.
News March 7, 2026
నిప్పుల కుంపటిలా నాగర్ కర్నూల్

జిల్లాలో వేసవి ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో పెంట్లవెల్లి మండలం జటప్రోలులో అత్యధికంగా 38.5°C ఉష్ణోగ్రత నమోదైంది. యంగంపల్లి, తిమ్మాజీపేటలో 38.4°C, ఊర్కొండలో 38.2°C గా రికార్డయ్యాయి. భానుడి భగభగలకు జిల్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు. మధ్యాహ్నం వేళ బయటకు వచ్చే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


