News August 9, 2024

కరీంనగర్: యువతి ఆత్మహత్య

image

ముగ్గురు వ్యక్తులు మానసికంగా, ఆర్థికంగా వేధించడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన మామిడి మొగిలి చిన్న కూతురు అఖిల(20) ఇంటి వద్ద ఉంటూ MLT చదువుతోంది. అఖిలను భరత్‌ అనే యువకుడితో పాటు మరో ఇద్దరు వేధించారని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై చేరాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 11, 2025

కరీంనగర్ జిల్లాలో 81.42% పోలింగ్ నమోదు

image

కరీంనగర్ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 5 మండలాల్లో తుది పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 81.42% పోలింగ్ కాగా, అత్యధికంగా చొప్పదండిలో 83.66% పోలింగ్ నమోదైంది. కరీంనగర్ రూరల్లో 84.67%, రామడుగులో 82.05%, గంగాధరలో 78.70%, కొత్తపల్లిలో 79.19% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. మొత్తం 91 గ్రామ పంచాయితీల్లో 152408 ఓట్లకు గాను 124088 ఓట్లు పోలయ్యాయి.

News December 11, 2025

గంగాధర: పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

image

గంగాధర మండలంలోని కూరిక్యాల, గంగాధర సహా పలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఓటు ప్రక్రియ సజావుగా జరుగుతున్న తీరును, ఓటింగ్ విధానాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఎంపీడీవో డి.రాము, తహశీల్దార్ అంబటి రజిత, ఎంపీఓ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.

News December 11, 2025

కరీంనగర్: ఆ రోజుల్లో వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి- కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీలకు 3-దఫాలుగా 2వ ఆర్డినరీ ఎలక్షన్స్ నిర్వహించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి ప్రకటించారు. మీ సంస్థలలో పనిచేసే కార్మికులకు 11, 14& 17 తేదీలలో (సంబంధిత మండలాలలో పోలింగ్ రోజున) వేతనం కూడిన సెలవు మంజూరు చేయాలని వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులందరికి తెలియజేశారు. ఈ సెలవును దుకాణాలు, సంస్థల చట్టం 1988, సెక్షన్ 13 ప్రకారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.