News September 11, 2025
కరీంనగర్: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి సూసైడ్ చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం మోతె గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మోతె వాసి బత్తిని తిరుపతి(42) కొద్ది నెలలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇటీవల అప్పులు చేశాడు. అప్పులు ఎలా తీర్చాలని బాధపడుతూ గురువారం ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. మృతుడి భార్య మనోజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 17, 2025
పెనమలూరు ORRతో అభివృద్ధికి ఊపు.!

పెనమలూరు పరిధిలో ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్డు (ORR)తో అభివృద్ధి వేగవంతం కానుంది. కంకిపాడు-ఉయ్యూరు సరిహద్దులో 25 K.M మేర విస్తరించే ఈ ORR భూసేకరణ కోసం సర్వే నంబర్‌ల గుర్తింపునకు కేంద్రం ఆమోదం తెలిపింది. మారేడుమాక, కోలవెన్ను సహా 8 గ్రామాల్లో 778 కమతాలను గుర్తించారు. దావులూరు-నెప్పల్లి హైవేకు అనుసంధానంగా ఈ ORR రూట్ ఏర్పాటు కానుంది.
News December 17, 2025
100 రోజుల స్టడీ ప్లాన్ ఓకే.. పిల్లల ఆకలి మరీ.?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 27వేల మంది పదో తరగతి విద్యార్థులకు DEC 6నుంచి 100రోజుల స్టడీ ప్లాన్ అమలు చేస్తున్నారు. స్కూల్ సమయం తర్వాత కూడా కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు రాత్రి 7గ.ట వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత సాయంత్రం ఏమీ తినకపోవడంతో విద్యార్థులు నీరసించి, చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సాయంత్రం వేళ పాలు, టిఫిన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
News December 17, 2025
ఆసుపత్రిలో చేరిన జైస్వాల్

టీమ్ ఇండియా ఆటగాడు యశస్వీ జైస్వాల్ ఆసుపత్రిలో చేరారు. SMATలో ముంబై తరఫున ఆడుతున్న ఆయన రాజస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా తీవ్రమైన కడుపునొప్పికి గురయ్యారు. దీంతో పుణే సమీపంలోని ఆదిత్య బిర్లా ఆసుపత్రికి తరలించారు. జైస్వాల్ గ్యాస్ట్రో సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని, వైద్యపరీక్షలు నిర్వహించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. కాగా నిన్నటి మ్యాచులో ముంబై 3 వికెట్ల తేడాతో గెలిచింది.


