News November 8, 2025
కరీంనగర్: రైతుల చూపులు.. ఆకాశం వైపు..!

ఉమ్మడి KNR జిల్లాలో వర్షాల మధ్య రైతుల ఆశలు తడిసి ముద్దవుతున్నాయి. చెమటోడ్చి పండించిన బంగారు ధాన్యం ఇప్పుడు ఆకాశం దయ మీద ఆధారపడి ఉంది. ఎండబెట్టిన క్రమంలో కురిసిన చినుకులు రైతు హృదయాన్ని తడుపుతున్నాయి. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఆలస్యమవడంతో, పొలాల పక్కన పంటను ఎండబెట్టిన ప్రయత్నంలో రైతులు నిస్సహాయంగా మారారు. కష్టానికి కడుపు నిండే ఫలితం దక్కుతుందా లేదా అనే ఆందోళనలో రైతుల చూపులు ఆకాశం వైపు చూస్తున్నాయి.
Similar News
News January 24, 2026
ఇంటర్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణపై అధ్యాపకులకు శిక్షణ

ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం మేరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు 27-01-2026 నుంచి 10-02-2026 వరకు, జనరల్ విద్యార్థులకు 01-02-2026 నుంచి 10-02-2026 వరకు పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, అధ్యాపకులకు శిక్షణ జరిగింది. పరీక్షల నిర్వహణ, ఆన్‌లైన్ మార్కుల నమోదు అంశాలపై సూచనలు ఇచ్చారు.
News January 24, 2026
రేపు రథ సప్తమి.. ఇలా చేయండి

రథ సప్తమిని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. రేపు సూర్యుడు ఉత్తరాయణ మార్గంలో ప్రయాణం ప్రారంభిస్తాడని పురాణాలు చెబుతాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేస్తే శుభకరమని పండితులు చెబుతున్నారు. సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ ఓం సూర్యాయ నమః మంత్రాన్ని జపించాలి. బియ్యం, గోధుమలు, బెల్లం, గోధుమ పిండి, దుస్తులు దానం చేస్తే శుభాలనిస్తుంది. మాంసాహారం, మద్యం సేవించకూడదు. కోపం, చెడు మాటలకు దూరంగా ఉండాలి.
News January 24, 2026
HYD: TDR కావాలా.. ఇవి తెలుసుకోండి!

మీ భూమి చెరువుల పరిధిలో ఉంటే లేదా రోడ్డు వెడల్పులో పోతే ప్రభుత్వానికి అప్పగించి TDR పొందవచ్చు. నాలాల విస్తరణకు కూడా 400% TDR ఇస్తున్నారు. టైటిల్ వివాదాలున్నా TDR బ్యాంక్‌లో మీ వాటా భద్రంగా ఉంటుంది. ఇప్పటివరకు GHMCలో దాదాపు 1070 ఎకరాలకు పైగా TDR ఇచ్చారు. అందులో చాలా వరకు వాడగా ఇంకా 316 ఎకరాల TDR అందుబాటులో ఉంది. ఆన్‌లైన్ ద్వారా మీరు కూడా మీకు కావాల్సిన వారితో బేరం కుదుర్చుకుని వీటిని అమ్ముకోవచ్చు.


