News December 2, 2025

కరీంనగర్: విదేశి విద్య కోసం ఫ్రీ కోచింగ్

image

ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ పాసైన విద్యార్థులకు విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించేందుకు కీలకమైన IELTS (ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం) ఉచిత శిక్షణ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 21 లోపు www.tgbcstudycircle.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News February 10, 2026

మహదేవప్ప కుటుంబానికి అండగా ఉంటాం: రామచందర్ రావు

image

మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రంగా స్పందించారు. గిరిజన నేతలపై కాంగ్రెస్‌కు ఉన్న కపట ప్రేమ మరోసారి బయటపడిందని, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎన్నికను వ్యతిరేకించడమే దానికి నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకులు, వారి గూండాలు మాఫియా తరహాలో బెదిరింపులకు దిగడం వల్లే యువ గిరిజన నేత మహదేవప్ప మృతి చెందడని ఆరోపించారు.

News February 10, 2026

నెల్లూరులో గీత దాటితే ఫైన్.. జాగ్రత్త!

image

నెల్లూరులో నూతన సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. DKW కళాశాల, KVR పెట్రోల్ జంక్షన్, VRC, కనకమహల్, రామలింగాపురం సహా ఏడు ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్ పెట్టారు. వీటి పనితీరును కార్పొరేషన్ కమిషనర్ వై.ఓ నందన్ పరిశీలించారు. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే సిగ్నల్ వద్ద ఉన్న కెమెరాల్లో రికార్డు అవుతుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆ వాహనానికి ఫైన్ వేస్తారు. ఇదంతా మీకు తెలియకుండా జరుగుతుంది.

News February 10, 2026

తాబేలు ఉన్న ఉంగరాన్ని ధరిస్తే..?

image

జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆర్థిక కష్టాలు తొలగి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి తాబేలు ఉంగరం ధరించడం మంచిదని పండితులు చెబుతున్నారు. ‘ఈ ఉంగరాన్ని ముందుగా పాలు, గంగాజలంతో శుద్ధి చేయాలి. ముందుగా లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచి పూజించాలి. గురువారం ఈ ప్రక్రియ పూర్తి చేసి, శుక్రవారం నాడు కుడిచేతి చూపుడు/మధ్య వేలుకు ధరించాలి. ఉంగరం పెట్టుకున్నప్పుడు తాబేలు ముఖం మీ వైపు ఉండేలా చూసుకోవాలి’ అని సూచిస్తున్నారు.