News February 18, 2025

కరీంనగర్: వ్యక్తిపై హత్యాయత్నం.. కేసు నమోదు

image

ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరగగా బాధితుడికి తీవ్ర గాయాలైన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన కొమురయ్య, అదే గ్రామానికి చెందిన రవి మధ్యలో భూతగాదాలతో గొడవ జరగగా వారిని ఆపేందుకు వెళ్లిన బత్తిని సాగర్‌పై రవి కొడవలితో దాడి చేశాడు. సాగర్‌కు తీవ్ర గాయాలవగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Similar News

News April 20, 2026

వివాదాల్లో ఖమ్మం పోలీసులు..!

image

ఖమ్మంజిల్లాలో పనిచేస్తున్న కొందరు పోలీస్ అధికారులు, సిబ్బంది తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఓ అధికారి గన్‌మెన్‌తో ఇంటి పనులు చేయిస్తున్న వీడియో వైరల్ కాగా, మరో అధికారి వద్ద పనిచేస్తున్న గన్‌మెన్ అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో DSPపోస్టుకు రూ.25లక్షలు, CIపోస్టుకు రూ.15లక్షల ధర పలుకుతున్నట్లు సమాచారం. ACB,Intelligence నిఘా ఉన్నా అవినీతికి చెక్ పడకపోవడంపై చర్చ సాగుతోంది.

News April 20, 2026

భీమవరంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

image

భీమవరం చినమిరం ప్రాంతంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి అందిన సమాచారంతో సీఐ కాళీ చరణ్ నేతృత్వంలో దాడులు నిర్వహించి, నిందితుల నుంచి రూ.23,160 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

News April 20, 2026

మెగాస్టార్ సినిమాలో అనిల్ కపూర్?

image

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇటీవల బాబీ ఆయనకు కథ వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాలో మోహన్‌లాల్ కూడా నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరి రోల్స్ కన్ఫర్మ్ అయితే మెగా సినిమాకు పాన్ ఇండియా హిట్ ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.