News February 18, 2025
కరీంనగర్: వ్యక్తిపై హత్యాయత్నం.. కేసు నమోదు

ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరగగా బాధితుడికి తీవ్ర గాయాలైన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన కొమురయ్య, అదే గ్రామానికి చెందిన రవి మధ్యలో భూతగాదాలతో గొడవ జరగగా వారిని ఆపేందుకు వెళ్లిన బత్తిని సాగర్‌పై రవి కొడవలితో దాడి చేశాడు. సాగర్‌కు తీవ్ర గాయాలవగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 20, 2026
పల్నాడు: అసభ్య ప్రవర్తన.. నిందితుడికి దేహశుద్ధి

నాదెండ్ల (M) గణపవరంలోని స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే ఒడిశాకి చెందిన ప్రసాద్‌దాస్ పంతులు అనే కార్మికుడు ఓ బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో తోటి కార్మికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి వాతలు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన నిందితుడిని చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించి, పోక్సో కేసు నమోదు చేశారు.
News April 20, 2026
నేడు రెండో విడత ‘రైతు భరోసా’ విడుదల

TG: రైతుభరోసా డబ్బుల కోసం ఎదురుచూస్తోన్న కర్షకులకు శుభవార్త. నేడు సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం భారీ బహిరంగ సభలో బటన్ నొక్కి ఫండ్స్ రిలీజ్ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మందికి పైగా రైతులకు రూ.5,653 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. గత నెల 23న తొలి విడత నిధులు ఇవ్వగా ఇప్పుడు రెండో ఎకరం వరకు నిధులు జమ కానున్నాయి.
News April 20, 2026
MNCL: చుక్క నీటి కోసం.. వందల గొంతుల పోరు!

భానుడి భగభగలకు భూగర్భం ఎండిపోయింది. దండేపల్లి మండలం గూడెం గ్రామంలో జలకళ మాయమై.. జలకలత మొదలైంది. ఊరిలోని బావులన్నీ అడుగంటి, ‘ఈడిగేవాడ’లోని ఒక్కగానొక్క బావి ఇప్పుడు ఊరంతటికీ ప్రాణాధారమైంది. అగాధంలో ఉన్న కాస్తో కూస్తో జలాన్ని తోడేందుకు ఆ బావిలోకి వందలాది మోటారు పైపులు పాముల్లా వేలాడుతున్నాయి. నీటి చుక్క కోసం మోటార్లు పోటీపడుతుంటే.. బావి గర్భం హాహాకారాలు చేస్తోంది.


