News September 12, 2025
కరీంనగర్: శ్మశానవాటికలో కరవైన వసతులు.. ఆగ్రహించిన గ్రామస్థులు

శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో 3 నెలల చిన్నారి అనారోగ్యంతో మృతిచెందింది. చిన్నారి మృతి చెందడంతో దహన సంస్కారాలు చేయడానికి వెళ్తుంటే వర్షం మొదలై రాత్రి అయింది. శ్మశానవాటికలో విద్యుద్దీపాలు లేకపోవడంతో అంధకారం ఏర్పడింది. గ్రామస్థులు, అంత్యక్రియలకు వచ్చిన కుటుంబ సభ్యులు తమ సెల్ ఫోన్ టార్చ్ లైట్లతో దహన సంస్కారాలు నిర్వహించారు. కనీస వసతులు లేకపోవడంతో అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News December 6, 2025
SRCL: పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి ఫేజ్ ఎన్నికలు నిర్వహించనున్న పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవికుమార్ శనివారం పరిశీలించారు. వేములవాడ అర్బన్ పరిధిలోని చీర్లవంచ, మారుపాక, చింతలతాన, కోనరావుపేట మండలం కొలనూరు, మర్తనపేటలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
News December 6, 2025
చాట్ జీపీటీతో వ్యవసాయ రంగానికి కలిగే మేలు

సాంకేతిక రంగాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లిన ‘చాట్ జీపీటీ’తో వ్యవసాయానికీ మేలే అంటున్నారు నిపుణులు. సాగులో నీళ్లు, ఎరువులు, పురుగు మందులను ఎంతమేర వాడాలి, పంట దిగుబడి పెరగడానికి అవసరమైన సూచనలను ఇది ఇవ్వగలదు. వాతావరణ సమాచారం, మట్టి స్వభావం, పంటకు ఆశించే తెగుళ్లు, చీడపీడలను విశ్లేషించి.. పంట దిగుబడికి అవసరమైన సూచనలతో పాటు పంట నష్టం తగ్గించే సూచనలను ఇది అందిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
News December 6, 2025
US అగ్నిప్రమాదం.. మృతులు హైదరాబాదీలే!

అమెరికాలో అగ్నిప్రమాద <<18481815>>ఘటనలో<<>> మరణించిన ఇద్దరు హైదరాబాదీలేనని తెలుస్తోంది. HYD జోడిమెట్ల సమీపంలోని శ్రీనివాసకాలనీలో నివాసముండే సహజారెడ్డి(24) ఉన్నత విద్య కోసం నాలుగేళ్ల క్రితమే USకు వెళ్లింది. నిన్న ప్రమాదంలో మరణించిందని అధికారులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె తండ్రి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాగా తల్లి ప్రభుత్వ ఉద్యోగి. మరో విద్యార్థి కూకట్ పల్లికి చెందిన వ్యక్తి అని సమాచారం.


