News November 8, 2025
కరీంనగర్: సీఎంను కలిసిన అర్బన్ బ్యాంక్ చైర్మన్

కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా CM కర్ర రాజశేఖర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కర్ర రాజేశేఖర్ బ్యాంకు అభివృద్ధి, కార్యాచరణ తదితర అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా బ్యాంకు అభివృద్ధికి ప్రభుత్వం పక్షాన పూర్తిగా సహకరిస్తామని CM తమకు హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు.
Similar News
News January 23, 2026
కృష్ణా: ‘త్వరలోనే అర్హులందరికీ అక్రిడిటేషన్లు’

కృష్ణా జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిందని సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వరప్రసాద్ తెలిపారు. వివిధ జర్నలిస్ట్ సంఘాల నుంచి తొమ్మిది మంది, కలెక్టర్ నామినేట్ నుంచి ముగ్గురు జర్నలిస్ట్‌లు మొత్తం 12 మందితో కమిటీ ఏర్పాటైందన్నారు. త్వరలోనే కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అర్హులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామన్నారు.
News January 23, 2026
రక్తంతో నారా లోకేశ్ చిత్రం

నందికొట్కూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డా.దేశెట్టి శ్రీనివాసులు తన రక్తంతో మంత్రి నారా లోకేశ్ చిత్రాన్ని గీశారు. లోకేశ్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ వినూత్న చిత్రాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. లోకేశ్ తెలుగు ప్రజల సంక్షేమం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని శ్రీనివాసులు ఆకాంక్షించారు.
News January 23, 2026
ప్రజలపై విద్యుత్ భారం లేకుండా చర్యలు: గొట్టిపాటి

రాబోయే మూడేళ్లలో యూనిట్ ఛార్జీలో రూ.1.19 వరకు తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ వ్యవస్థను గాడిలో పెడుతున్నామని అన్నారు. నాణ్యమైన విద్యుత్ తక్కువ ధరలకు అందిస్తే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.


