News September 13, 2025

కరీంనగర్: సీఐపై చర్యలు తీసుకోండి: ఏబీవీపీ

image

ఏబీవీపీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో మహిళా అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేసిన మహిళ సిఐ శ్రీలతపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ టౌన్ ఏసీపీకి ఏబీవీపీ నాయకులు పిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాంబాబు, రాకేష్, విష్ణు తదితరులు ఉన్నారు.

Similar News

News December 11, 2025

తిరుపతి: ఆలయ ఉద్యోగి ఇంట్లో రూ.10 లక్షల భారీ చోరీ

image

తిరుపతి రూరర్(M) పెరుమాలపల్లి పంచాయతీ, ఎస్‌వీ నగర్‌లో భారీ చోరీ జరిగింది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్న డబేదార్ వల్లేటి మురళీమోహన్ ఇంట్లో రాత్రి దొంగలు పడ్డారు. ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. రెండు బీరువాలలో ఉన్న రూ.10 లక్షల నగదు, 320 గ్రాముల బంగారు ఆభరణాలు దోచుకున్నారు. బాధితుని ఫిర్యాదుతో రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News December 11, 2025

ములుగు: మొదటి విడత ఎన్నికలో ఓటేసిన 47,472 మంది

image

మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగిన మూడు మండలాల్లో 60,361 మంది ఓటర్లకు గాను 47,472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో మహిళలు 24,412కాగా.. పురుషులు 23,055, ఇతరులు ఐదుగురు ఉన్నారు. ఏటూరునాగారం మండలంలో 22,279 మందికి గాను 18,043 మంది, గోవిందరావుపేటలో 20,402 మందికి 15,501 మంది, తాడ్వాయిలో 16,680 మంది ఓటర్లకు 13,928 మంది ఓటేశారు.

News December 11, 2025

విలోచవరం గ్రామ సర్పంచ్‌గా కొండ ప్రేమలత విజయం

image

మంథని మండలం విలోచవరం గ్రామ సర్పంచ్‌గా కొండ ప్రేమలత రవీందర్ విజయం సాధించారు. ఆమె తన సమీప అభ్యర్థిపై 178 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. విద్యావంతురాలు, న్యాయవాది అయిన ప్రేమలత వైపు గ్రామస్తులు మొగ్గు చూపడం విశేషం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఐదు సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉంటూ, గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలంతా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.