News December 2, 2025
కరీంనగర్: సెటిల్‌మెంట్ల కోసం నామినేషన్లా..?

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొందరు ప్రజాసేవ చేద్దామని నామినేషన్లు వేస్తుంటే మరికొందరేమో ఇదే అదునుగా దందా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు కావాలని నామినేషన్లు వేసి, ప్రధాన పోటీదారులతో మాట్లాడుకుంటున్నారు. కొంత డబ్బు తీసుకుని విత్‌డ్రా చేసుకుని సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను సైతం చివరకు బిజినెస్ చేశారని పలువురు మండిపడుతున్నారు.
Similar News
News February 16, 2026
విశాఖలో గవర్నర్‌కు ఘన స్వాగతం

విశాఖలో జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సోమవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, నగర పోలీసు కమిషనర్ సంఖ బ్రత బాగ్జీ, నౌకాదళ అధికారులు ఘన స్వాగతం పలికారు.
News February 16, 2026
హోరాహోరీ పోరులో పాలమూరు విజయం

జడ్చర్లలో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-17 టోర్నీ ఫైనల్‌లో మహబూబ్ నగర్ జట్టు 15 ఓవర్లలో 110/5 పరుగులు చేసింది. రామ్ చారి 31, కేతాన్ 30 పరుగులు చేశారు. నాయక్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం ఖమ్మం జట్టు 107/5 పరుగులు చేసింది. 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మాన్విత్ 30, సులేమాన్ 29 పరుగులు చేశారు. ముఖ్య అతిథిగా ఏఎంఓ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ జ్యోతి హాజరయ్యారు.
News February 16, 2026
బిల్ గేట్స్ అమరావతి పర్యటన హైలైట్స్

గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్‌గేట్స్ అమరావతి పర్యటన ఆసక్తికరంగా సాగింది.
• అమరావతి రాజధాని ప్రణాళికలను.. బ్లూ-గ్రీన్ కాన్సెప్టు, అత్యాధునిక పద్దతుల్లో ఫ్యూచర్ సిటీగా నిర్మిస్తున్న విధానాన్ని తెలుసుకున్న బిల్ గేట్స్ గ్రేట్ వర్క్ రాజధాని మాస్టర్ ప్లాన్‌ను మెచ్చుకున్నారు.
• రాజధాని ప్రాంతంలో మొత్తంగా గ్రీన్ ఎనర్జీనే వినియోగించే దిశగా.. ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు గేట్స్‌కు సీఎం వివరించారు.


